Saturday, 23 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (12)



                                                             



23.06.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

సాయి.బా.ని.స. డైరీ - 1998 (12)


03.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) ప్రభుత్వమువారు గోదావరి నదికి ఆనకట్ట కట్టి ఆనీరును నీపంటపొలాలకు అంద చేస్తున్నారు.  



నీవు ఆనీరుతో మంచి పంటలు పండించి సుఖశాంతులతో జీవించుతున్నావు .  



మరి అటువంటి అపుడు నీవు ప్రభుత్వమువారికి శిస్థు కట్టవలసియున్నది కదా.  అదే విధముగా భగవంతుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత భగవంతుని సదా స్మరించుతు జీవించాలి కదా. 

2) నీజీవిత ఆఖరి దశలో నీతో కలసి ప్రయాణము చేయడానికి నీవాళ్ళు ఎవరు సిధ్ధపడరు.  ఆవిషయాన్ని నీవు గ్ర్రహించి సద్గురువు సహాయముతో ఒంటరి జీవితాన్ని ప్రారంభించు.  ఒంటరిగా ప్రయాణము సాగించుతు నీగమ్య స్థానము చేరుకో.



09.08.1978

నిన్నరాత్రి శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకు అన్యాయము చేయడానికి సిధ్ధపడినవారిని నీవు యుక్తితో ఎదుర్కొని వారికి బుధ్ధి చెప్పాలి.

2) తల్లితండ్రులు పిల్లల మధ్య బంధుత్వము అనే గొలుసువంటివారు.  ఒకవేళ గొలుసు  తెగినరోజున బంధుత్వాలు దూరము అయిపోతాయి.  దాని గురించి  ఎక్కువ బాధపడరాదు.

3) నీచొక్క జేబులో రూపాయ నోట్లకట్టలు దాచుకొని జాగ్రత్తపడుతున్నావే, మరి ఆనోట్ల కట్టలును నీకు ప్రసాదించిన ఆభగవంతుని నీగుండెలో దాచుకొంటున్నావా ఒక్కసారి ఆలోచించు.

4) పెద్దలు చేసిన పొరపాట్లుకు పిల్లలు కష్ఠాలు పడక తప్పదు.  అదే దేశ  రాజకీయాలలో నాయకులు చేసే పొరపాట్లుకు ప్రజలు బాధపండుతున్నారు.  అందుచేత భావి తరాలకు మంచి రోజులు కావాలి అంటే ఈనాడు మనము పొరపాట్లు చేయరాదు.


11.08.1998

నిన్నరాత్రి శ్రీసాయి ఒక సన్యాసి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1)పంజరములోని చిలుక తనకు జామపండ్లు యితర పండ్లు, ఫలాలు లభించినంత కాలము పంజరములో సుఖముగానే యుంటుంది. 




 అలాగే మన శరీరము  ఆరోగ్యముగా  ఉన్నంత  కాలము మన ఆత్మ ఆ శరీరములో సుఖముగానే యుంటుంది.  పంజరములోని చిలుకకు పండ్లు లభించకపోయినపుడు, శరీరము అనారోగ్యముపాలు అయినపుడు, పంజరములోని చిలుక, శరీరములోని ఆత్మ త మ బందిఖానాలనుండి బయటపడాలి అని తపించిపోతాయి. 
2) అప్పు ఇచ్చువాడు, పుచ్చుకొన్నవాడు మొదటిరోజున బాగానే యుంటారు. పుచ్చుకొన్నవాడు  ఆడబ్బును తిరిగి అప్పు ఇచ్చినవానికి ఇవ్వ్డములో జాప్యము చేసిన సరిగా ఇవ్వకపోయిన గొడవలు ప్రారంభము అయి జీవితాలలో అశాంతి ప్రబలిపోతుంది.  అందుచేత అప్పుజోలికి పోవద్దు.  ఉన్నదానితో సుఖముగా ఉండు.

3) వివాహ బంధము మన శారీరిక , మానసిక దాహాన్ని తీర్చే పవిత్ర బంధము.  నీవు వివాహబంధము అనే సరస్సులో ఒక కలువపూవులాగ జీవించుతు శారీరక మానసిక దాహాన్ని తీర్చుకో.  



(యింకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు )

No comments:

Post a Comment