Friday 8 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1997 (15)





08.06.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి.బా.ని.స. డైరీ - 1997  (15)

02.12.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తిరూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నేటి యువతీ యువకులు తమతమ నిజ పరిస్థితులను మరచిపోయి ఊహాలోకములో విహరించుతు తమ జీవితాలను నాశనము చేసుకొంటున్నారు.  ఇది మంచి పధ్ధతి కాదు.


2) సాత్విక ఆహారమును తినడానికి మంచి మాటలను మాట్లాడటానికి భగవంతుడు మానవునికి నోరు ఇచ్చినాడు.  మరి ఆనోటితో తినకూడని పదార్ధాలు తింటు, చెడు విషయాలు మాట్లాడుతు పవిత్రమైన నోరును అపవిత్రము చేసుకొని జీవించటములో అర్ధములేదు. 

3) ఒకసారి నీమనసును లోని మురికిని ఆధ్యాత్మిక నదీ ప్రవాహములో శుభ్రము చేసిననాడు ప్రాపంచిక జీవితములో నీవు నగ్నముగా స్నానముచేసిన, లేదా నగ్నముగా స్నానము చేయుచున్నవారిని చూసిన నీలో ఏవిధమైన చెడు ఆలోచనలు రావు అనేది గ్రహించగలవు.    

4) ప్రకృతిని చూసి ఆనందించగలవు.  ఆప్రకృతిని ఛాయాచిత్రము రూపములో బంధించగలవు.  


వాటివలన నీకు కలిగే మేలు ఏమీలేదు.  నిజముగా నీవు ప్రకృతిని ప్రేమించినవాడివి అవుతే ఆప్రకృతినేర్పిన పాఠాలను నీమనసులో అధ్యయనము చేస్తు నీజీవితాన్ని ముందుకు నడిపిననాడు నీకు నిజమైన మేలు జరుగుతుంది.      

13.12.1997

నిన్నరాత్రి శ్రీసాయి నాచిన్ననాటి స్నేహితుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవితములో నీవు తప్పుడు పనులు చేస్తు ఉన్నావని నీకు తెలిసినపుడు దానికి జరగబోయే పరిణామాలకు కూడా సిధ్ధపడి యుండాలి. 

2) నీవెనుక నీగురించి అన్యాయముగా నిన్ను ఆడిపోసుకొనేవారినుండి నీవు ఏమీ భయపడనవసరము లేదు.  నీవు వారిజోలికి పోకపోతే వారే నిన్ను మర్చిపోతారు.  

3) పరుల మతవిషయాలలో కలుగచేసుకోవటముకన్న, పరస్త్రీవ్యామోహముకన్న, ధనవ్యామోహము చాలా భయంకరమైనది.  ఈధనవ్యామోహము వలనే కొందరు నిన్ను పొగుడుతారు.  మరికొందరు నిన్ను తిడతారు.  

అందుచేత నీవు ధనవ్యామోహము విడనాడు.  మరియూ ధనవ్యామోహనాపరులనుండి దూరముగా జీవించు.    

19.12.1997

శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 
1) నీజీవితము ఒక క్రీడారంగము అయితే నిన్ను నేను ఉన్నత ప్రమాణాలు సృష్ఠించే ఒక గొప్ప ఆటగానిగా తయారు చేస్తాను. 

2) యితరమత సాంప్రదాయాలను పాటించేవారు నీ  దగ్గరకు వచ్చినపుడు వారిని గౌరవించి వారి పండగలకు వారిని అభినందించు.  అంతేగాని వారి మతపరమైన విషయాలను మాట్లాడవద్దు. 

3) ప్రాపంచిక రంగములో నీవు యితరుల సహాయము కోరిననాడు నీవు వారికి సదా అణగిమణిగియుండాలి.  అదే నీవు ఆధ్యాత్మిక రంగములో నీగురువు సహాయము కోరిననాడు నీగురువు సదా నీకు తనప్రేమను పంచుతు, నిన్ను కాపాడుతు ఉంటాడు.

4) ఆధ్యాత్మిక రంగ ప్రయాణము నీవు ఒక్కడివే చేయాలి.  నీగమ్యాన్ని చేరాలి.  












(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment