Tuesday 19 June 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (08)



                                                               

                                               

                             
19.06.2012  మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి.బా.ని.స. డైరీ - 1998 (08)

25.04.1998

శ్రీసాయి నిన్న రాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు
1) నా సంతోషముకోసము నేను పిచ్చుకలను (నాభక్తులను) పట్టి నాజోలిలో వేసుకొని వాటికి అన్నపానీయాలు, రక్షణ ఇచ్చి నేను ఆనందము పొందుతాను. 

 నేను పొందే ఈఅనుభూతిని ఇతరులకు  తెలియచేయడానికి సత్ సంగాలలో నా వాళ్ళు పిచుకల కలను అందరికి తెలియ చేస్తు ఉంటారు.

2) శరీరము అనె గూటిలోని పిచ్చుక యొక్క గూడు పాడైపోయిన, నేను ఆగూటిలోని పిచ్చుకను (ఆత్మను) వేరే గూటిలో చేర్చి దాని ఆలన పాలన చూసుకొంటాను. 

30.04.1998

శ్రీ సాయి నిన్న రాత్రి నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) ధన సంపాదన అనేది నీకష్ఠార్జితమునకు సంబంధించినది.  కష్ఠపడకుండ యితరుల ధనాన్ని ఆశించటములో అర్ధము లేదు. కష్ఠపడకుండ ధనము సంపాదించాలి అనే భావన నీలో గూడు కట్టుకొని యున్న దొంగబుధ్ధిని తెలియచేస్తుంది.  

2) నీ కళ్ళకు తగిన కళ్ళజోడు సరసమైన ధరకు లబించిన కొనటము న్యాయము.  ధనము ఖర్చు పెట్టడములో పిసినిగొట్టుతనం చూపించి చవకబారు కళ్ళజోడు కొని 

దానిని ధరించి లేని తలనొప్పిని తెచ్చుకోవటం నీలోని మూర్ఖత్వమునకు నిదర్శనము. 

3) దుకాణములోని పనివాడు సరుకులు అమ్మగా వచ్చిన ధనాన్ని దుకాణము యజమానికి లెక్కలు చూపి అంద చేస్తాడే.  మరి సాయి సత్ సంగాలును నిర్వహించే నీబోటి పనివాళ్ళు, సత్ సంగాలలో వచ్చే గురు దక్షిణలను సాయి సేవలో వినియోగించకుండ స్వంత ఖర్చులకు వినియోగించటాన్ని ఏమి అనాలి అనేది నీవే ఆలోచించు.   

01.05.1998

నిన్న రాత్రి శ్రీసాయి నాదగ్గర బంధువు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 
 
1) ఏపని మొదలుపెట్టిన భగవంతుని నమ్ముకొని మంచి మనసుతో ప్రారంభించిన ఆపని విజయవంతము అగుతుంది. 
2) ఇరుగు పొరుగు వారితో గొడవలు రానివిధముగ మసలటము నేర్చుకో.  అప్పుడే జీవితము ప్రశాంతముగా సాగిపోతుంది.   

3) మత సాంప్రదాయాలకు నేను అతీతుడిని అని చెప్పుకొంటు గొప్పలకు పోవద్దు.  యితరమతస్థులు ఎదురు పడినప్పుడు వారి మత సాంప్రదాయాలలో తలదూర్చకుండ వారికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇచ్చిననాడు నీకు మనస్ప్రర్ధలు రావు. 

4) నీజీవితములో భవిష్యత్ లో ఏదో చేయాలి అని కలలు కనేకన్న, వర్తమానములో మంచిపనులు చేస్తు ప్రశాంతముగా జీవించటము నేర్చుకో.   
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment