షిర్డీ సాయితో సాయిబానిస అనుభవాలు -- 1
1989 ముందువరకు నాకు శ్రీ షిరిడీ సాయిబాబా గురించి తెలియదు. 1989, జనవరిలో ఒకరు నాకు శ్రీ సాయిబాబా ఫోటోనిచ్చారు. ఆ ఫొటోని చూసినప్పుడెల్లా సాయి నావైపు నవ్వుతూ ఉన్నట్లుగా నాకు అనిపించేది. నిజంగా అది అయస్కాంతంలా నన్నాకర్షించింది. నేను తప్పకుండా షిరిడి దర్శించాలనిపించింది . 1989 జూలై నెలలో మా పొరింగింటాయన శ్రీ భోన్స్లే గారు తనతో కూడా షిరిడీ కి రమ్మని నన్నాహ్వానించారు. నేను షిరిడీ వెళ్ళాను అదే నా జీవితంలో మలుపు. 07.06.1990 నుంచీ నేను ప్రతీరోజు శ్రీ పత్తి నారాయణరావు గారు వ్రాసిన "సాయి సచ్చరిత్ర" ను చదవడం ప్రారంభించాను, అప్పటినుంచీ నా జీవిత విథానం పూర్తిగా మారిపోయింది.1989 కి ముందు నేను ఒక ఒక గమ్యము లేని మనిషిగా ఉన్నాను. "శ్రీసాయి సచ్చరిత్ర" చదివిన మొదటి రోజునే నా సంసార జీవితంలో బాధ్యత, గౌరవప్రదమైన జీవితం తెలిసింది. 11.04.1991 న సాయి సచ్చరిత్రలో 21 వ అధ్యాయం చదువుతున్నాను, 175 పేజీలోని ఈ క్రింది వాక్యాలు నన్నాకర్షించాయి, "నువ్వీ పుస్తకాన్ని తప్పక చదవాలి, అలా చేస్తే కనక నీ కోరికలు నెరవేరతాయి, నీ విథులు నిర్వర్తించడానికి నువ్వు ఉత్తరంవైపుకు వెళ్ళినప్పుడు నీ అదృష్టముచేత ఒక సాథువును కలుసుకుంటావు, అప్పుడాయన నీకు భవిష్యత్తుకు దారి చూపిస్తారు, నీ మనస్సుకు ప్రశాంతతనిస్తారు" 1991, మార్చ్ లో , ఆఫీసు పనిమీద కొంతమంది ఆఫీసర్లని స్వీడన్ మరియు దక్షిణ కొరియాకి పంపుతారనే మాట ఆఫీసులో వచ్చింది.
11.04.1991
ఉదయం 7.30, నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఇమ్మని బాబాని ప్రార్తించాను. 11.04.1991 న నేను ఆఫీసుకు వెళ్ళేటప్పటికి, పాస్ పోర్ట్స్ పేపర్స్ మీద నన్ను సంతకాలు చేయమన్నారు. ఛీఫ్ ఎగ్జ్యిక్యూటివ్ గారు మరొకరితో మరియు దక్షిణ కొరియ వెళ్ళడానికి నా పేరుకూడా రెకమెండ్ చేశారని ఆరోజు తెలిసింది. పాస్పోర్ట్ పేపర్స్ మీద నేను సంతకం చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, శ్రీ షిరిడీ సాయినాథుని చరణ కమలాల మీదశిరసు వంచి నా "ప్రణామాలు" సమర్పించుకున్నాను.
01.05.1991 న అఫీషియల్ పాస్పోర్ట్, విసా నా చేతికి వచ్చాయి. నేను నా తోటి ఆఫీసరు కలసి 05.05.1991 న హైదరాబాదునుంచి దక్షిణకొరియా కు బయలుదేరాము.
06.05.1991
న తెల్లవారుజామున ఒంటి గంటకు, బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నా సెక్యూరిటీ చెక్ పూర్తయింది, స్విస్ యైర్ వారి విమానంలోకి యెక్కడానికి నేను నిరీక్షిస్తున్నాను (ఫ్లైట్ జ్యూరిచ్-బొంబాయి-హాంగ్ కాంగ్-సియోల్). విమానంలోకి యెక్కేముందు బాబాని ప్రార్థించుకోవాలనిపించింది . యైర్ పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాపులన్నిటి పక్కనుంచి వెడుతూ ఉండగా ఒక షాపులో సాయి బాబా పటం కనపడేటప్పటికి నాకు సంతోషం కలిగింది.అప్పుడు సమయం తెల్లవారుజాము 1.10 అయింది, విమానం 1.20 కి బయలుదేరుతుంది. నేను ఆ పటంముందు రెండు నిమిషాలు నిలబడి ప్రార్థించుకుని విమానంలోకి యెక్కాను. సమయం 1.20 అయింది, విమానం రన్ వే మీద కదులుతోంది. 1.30 కి విమానం గాలిలోకి లేచింది. యింటనేషనల్ ఫ్లైట్ లో విదేశానికి ప్రయాణిం చేయడం అది నా మొదటి అనుభవం, నా గుండె వేగంగా కొట్టుకుంటొంది. నేను 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఓం సాయి - శ్రీ సాయి - జయజయ సాయి' సాయి నామం జపించుకోవడం మొదలెట్టాను. పైలట్ సీట్ బెల్ట్స్తీ తీసి రెలాక్స్ గా కూర్చోమని అనౌన్స్ చేశాక నాకు ఆనందం వేసింది. అప్పుడు విమానం 40,000 అడుగుల యెత్తులో గంటకు 900 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. విమానం టేక్ ఆఫ్ అయ్యేముందు మంచి శరీర దారుఢ్యము గల ఒక పెద్ద మనిషి నాపక్కన కూర్చున్నాడు. యైర్ హోస్టెస్ కూల్ డ్రింక్స్ ఇస్తూండగా, నేనా పెద్దమనిషిని ఆయనెవరూ, యెక్కడనించి వస్తున్నారని స్నేహపూర్వకంగా అడిగాను. తన పేరు రాజ్.ఐ.మిర్పూర్ అని షిరిడీనుంచి హాంగ్ కాంగ్ వెడుతున్నట్లుగా చెప్పాడు. నాకెంతో సంతో షం కలిగి ఆయనతో సాయిలీలల గురించి మాట్లాడటం మొదలుపెట్టాను. మేము తెల్లవారుజాము 3.00 గంటలవరకూ మాట్లాడుకున్నాము. నేను సాయిబాబా కాకడ ఆరతి చదువుకోవడానికి 5.00 గంటలకు అలారం పెట్టుకుని నిద్రపోయాను.
అలారం మోగుతూండగా లేచాను. విమానం బయట ప్రకాశవంతమైన సూర్యుని వెలుతురు చూశాను.యైర్ హోస్టెస్ బ్రెక్ ఫాస్ట్ అందచేస్తోంది. ఆమెని టైం యెంతయిందని అడిగాను. స్థానిక కాలమానం ప్రకారం ఇప్పుడు ఉదయం 8 గంటలని చెప్పింది. నేను మొహం కడుగుకొని కాకడ ఆరతి చదువుకోవడం మొదలు పెట్టాను. నా పక్కన కూర్చున్నాయన (మిస్టర్.రాజ్.ఐ.మిర్పురి) కాకడ ఆరతి కొంచెం పెద్దగా చదవమనీ తను కూడా వింటాననీ అన్నాడు. కాకడ ఆరతి చదవడం పూర్తి చేసి ఉదయం ఇచ్చిన పలహారాన్ని సాయికి నైవేద్యంగా పెట్టి, ఆ ప్రసాదాన్ని ఆ పెద్దమనిషికి కూడా ఇచ్చాను. అది సాయి ప్రసాదమె అని గ్యారంటీ యేమిటి అని నన్ను ప్రశ్నించాడు ఆయన. ఆయన ప్రశ్నకి తప్పకుండా జవాబివ్వాలనిపించింది నాకు. నా పరిస్తితిని గురించి సాయిని ప్రార్థించాను. ఆ బ్రేక్ ఫాస్ట్ ప్లేట్ వైపు చూసినప్పుడు కవరుమీద సాయి అన్న అక్షరాలు కనిపించాయి . నిజానికి దానిమీద యింగ్లీషులో స్విస్స్ యైర్ (SWISSAIR) అని ప్రింట్ చేయబడి ఉంది. దానిమీద నా పెన్నుతో సాయి అన్న అక్షరాల కింద గీత గీసి 'సాయీ' ఆ పెద్దమనిషికి చూపించాను. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సాయి పరబ్రహ్మమని ఆయనకి చెప్పాను. సాయిమీదున్న నా భావలకి నన్నాయన అభినందించాడు. విమానంలో ఉన్న స్కై షాపునుంచి ఒక స్వీట్ పాకెట్ కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలయింది. విమానం హాంగ్ కాంగ్ లో ఆగింది. యిండియాకి తిరిగి వెళ్ళాక ఆయనకి ఉత్తరం రాసేందుకు నేనాయనని ఆయన విజిటింగ్ కార్డ్ ఇమ్మని అడిగాను. చిరునవ్వుతో తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆయన విమానం దిగి వెళ్ళిపోయాడు. హాంగ్ కాంగ్ లో కొద్ది సేపు ఆగిన తరువాత విమానం ఆఖరికిమధ్యాహ్న్నం ఒంటిగంటకు సియోల్ పట్టణం చేరింది. (అక్కడి స్థానిక టైము 1.00 పి. సియోల్ నుంచి నేను, నా తోటి ఆఫీసరు పుసాన్ వెళ్ళే డొమెస్టిక్ ఫ్లైట్ లో యెక్కాము. పుసాన్ నగర ఏర్ పోర్ట్ లో మమ్మల్నిసామీ కంపనీ అధికారులుస్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా చాంగ్ వన్ నగరానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు సాయంత్రం 6.30 అయింది (అక్కడి సమయం) నేను హోటలుకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను. రాత్రి 8 గంటలకి మా సామీ కంపనీ అధికారి వచ్చి మమ్మలిని రాత్రి భోజనానికి రమ్మని పిలిచాడు. నేనతనితో ఒక అరగంట వేచి ఉండమని బాబాకు రాత్రి ఆరతిపూర్తి చేసుకుని వస్తానని చెప్పాను. అతను వేచి ఉండటానికి అంగీకరించాడు. నేను సాయి బాబాకి శేజ్ ఆరతి పూర్తి చేశాను. ఆరతి సమయంలో, చాంగ్వన్ లో కూడా నువ్వున్నావనే భావం కలిగించమని సాయిని ప్రార్థించాను.
ఆరతి అయిన తరువాత సామీ కంపనీ అధికారి హోటలు రూము బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి దీపాల కాంతిలో చాంగ్ వన్ సిటీని చూపించడం మొదలుపెట్టాడు. దగ్గలో ఉన్న మరొక హోటలు మీద సాయి (SaI) అని పెద్ద నియాన్ అక్షరాలతో చూసి ఆశ్చర్య పోయాను.
నేను ని నియాన్ సాయిఅక్షరాల గురించి అడిగాను. అతను సాయి గురించి ఏమీ చెప్పలేకపోయాడు, కానీ నన్ను ఆప్రదేశానికి తీసుకుని వెడతానని మాటిచ్చాడు. నన్నతను హోటలు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నేను సాయి అన్న నియాన్ అక్షరాలను స్పష్టంగా చూడగలిగాను, కాని మిగతా అక్షారాలు మెరవటల్లేదు. నేను నియాన్ అక్షరాల దగ్గిరగా వెళ్ళి చూసేటప్పటికి అది సలూన్ (SALOON). నేను నా హోస్ట్ ని సలూన్ అంటే అర్థమేమిటని అడిగాను. అతను సలూన్ అంటే బార్ అని చెప్పి అక్కడ విశ్రాంతిగా కూర్చుని బీరు తాగవచ్చని చెప్పాడు. నా కోరికని తీర్చడానికి సాయి నియాన్ అక్షరాల రూపంలో కనిపించి, తాను ఈ భోగోళంమీద ప్రతీచోటా ఉన్నానని నిరూపించాడు. సౌత్ కొరియాలో నా అధికారిక పని ముగిసిన తరువాత 21.05.1991 న నేను హైదరాబాదుకి తిరిగి వచ్చాను. హాంగ్ కాంగ్ లో ఉన్నతనికి రెండు ఉత్తరాలు వ్రాశాను, కాని అతనినుంచి నాకు సమాథానం రాలేదు. నాకు ఏ సమాథానం రాకపోయేటప్పటికి అతను సాయి అనిపించింది. అతనిచ్చిన విజిటింగ్ కార్డ్ చూశాను దానిమీద చిన్న సైజు గ్లోబ్ ఎంబ్లం చూశాను. ఈ విశ్వంలో సాయి ప్రతీచోటా ఉన్నాడనిపించింది.
No comments:
Post a Comment