Monday, 2 January 2012

బాబాతో సాయి బా ని స అనుభవాలు 15


బాబాతో సాయి బా ని అనుభవాలు 15


శ్రీ సాయి సచ్చరిత్రలోని 33 అధ్యాయంలో ప్రముఖంగా శ్రీ అప్పా సాహెబ్ కుల్ కర్నీకి జరిగిన సంఘటన చెప్పబడింది. సంఘటన మనమొక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. శ్రీ కుల్ కర్నీ భార్య తాను ఒక ఫకీరుకు బాబా పేరు మీద ఒక రూపాయి దానము చేశానని చెప్పినది. తన భార్య చేసిన మంచి పనికి సంతోషించి సమయములో తాను ఉండి వుంటే బాబా పేరిట ఫకీరుకు పది రూపాయలు ఇచ్చి వుండేవాడిని కదా అని తలిచెను. వెంటనే తాను ఫకీరు గురించి వెతకటము ప్రారంభించి ఫకీరుకు పది రూపాయలు ఇచ్చినాడు. ఇది మనకు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును గుర్తు చేస్తుంది. శ్రీ సాయికి మన మనసులోని ఆలోచనలు తెలుసు. దానికి తగిన విధంగా మన నమ్మకాన్ని పెరిగేలాగ చూస్తారు.

ఇటువంటి సంఘటనే నాకు కూడా జరిగింది. ఇప్పుడు సంఘటనను మీతో పంచుకుంటాను. 1970 సంవత్సరము హోళీ పండుగ రోజున సికిందరాబాదులోని శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయములో నా వివాహము జరిగినది.

ప్రతీ సంవత్సరము హోళీ పండగ రోజున నేను నా కుటుంబ సభ్యులము మందిరానికి వెళ్ళి పూజలు చేయటము అలవాటుగా మారింది. అది 1991 సంవత్సరము హోళీ పండగ రోజు. యెప్పటిలాగే గుడికి వెళ్ళాము. సాయిని పోలిన ఒక సన్యాసి మందిరము దగ్గిరకి వచ్చి తాను విజయవాడ కనక దుర్గమ్మ మందిరమునుంచి వచ్చినానని తనకి ఏదయిన దానము చేయమని కోరినాడు. నాకు అలవాటు ప్రకారము ఒక రూపాయి దానము చెశాను. పూజలు చేసుకోవడానికి నేను, నా భార్య గుడిలోపలికి వెళ్ళాము. పూజారిగారు మంత్రాలు చదవడంలో నిమగ్నమై ఉన్నారు. నా మనసులో మాత్రము ఒక విధమైన అలజడి ప్రారంభమయినది. వివాహ వార్షికోత్సవ సందర్భంలో విజయవాడ కనకదుర్గమ్మ మందిరమునించి వచ్చిన సన్యాసికి పది రూపాయలు దానము చేసిఉండిన బాగుండేదని ఆలోచించాను.

నేను నా భార్య కన్యకాపరమేశ్వరీ దేవికి పూజలు పూర్తి చేసుకుని విశ్రాంతిగా ఒక బెంచీ మీద కూర్చుని అప్పటి వరకు మా జీవితంలో జరిగిన సంఘటనలు నేను నా భార్య మాట్లాడుకోసాగాము. సమయంలో మా ముందుకు ఒక సిక్కు సన్యాసి వచ్చి తాను నాందేడులోని గురుద్వారాలో సేవకుడనని పరిచయము చేసుకుని నానుండి పదిరూపాయల దక్షిణ కోరినాడు.


క్కసారిగా నా మనస్సు సంతోషముతో నిండిపోయినది. నా మనసులోని ఆలోచనలను బాబా తెలుసుకుని నా నుండి పదిరూపాయలు దక్షిణ కోరుతున్నారని భావించాను. నేను నా భార్య కు విషయము తెలియచేసి పది రూపాయల నోటును సిక్కు సన్యాసికి దక్షిణగా ఇచ్చినాను. సిక్కు సన్యాసి చిరునవ్వుతో నానుండి దక్షిణ స్వీకరించి మమ్ములను ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. గుడిలోని పూజానంతరము ఇంటికి వచ్చి నా యింటిలోనిపూజా మందిరములోని సాయి పటానికి నమస్కరించినప్పుడు సిక్కు సన్యాసియొక్క చిరునవ్వు గుర్తుకు వచ్చినది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment