Monday 30 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (18)



సాయి.బా.ని.. డైరీ -  1994 (18)
22.06.1994

నిన్నటిరోజున రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధా - ఆధ్యాత్మిక రంగములో ముందు అడుగు వేయాలి అని ఉంది. మరి నాలోని లోటుపాట్లు నాకు తెలియచేయి నేను సరిదిద్దుకొంటాను" అని వేడుకొన్నాను.   



శ్రీ సాయి చూపిన దృశ్యము నాలోని లోటుపాట్లు తెలియచేసినవి.  వాటి వివరాలు.  నేను శిల్ప కళ నేర్చుకోవాలి అనే కోరికతో ఒక ముస్లిం శిల్పకారుడి దగ్గరకు వెళ్ళి నాకు శిల్పకళ నేర్చుకోవాలి అనే కోరిక యుంది, ముందుగా నా చేత గణపతి విగ్రహము తర్వాత శ్రీ సాయిబాబా విగ్రహము చెక్కించమని కోరుతాను.  కాని ముస్లిం శిల్పకారుడు ముందుగా అందమైన స్త్రీ శిల్పము చెక్కమని ఆదేశించినారు.  నేను స్త్రీమూర్తి విగ్రహము చెక్కే సమయములో నాలో స్త్రీ వ్యామోహము, కోరికలు ఎక్కువగా కలగ సాగినవి.  ఏకాగ్రత లోపించసాగినది.  అయినా శిల్పమును చెక్కసాగినాను.   
 
కాని శిల్పము విరిగిపోయినది.  అపుడు    ముస్లిం శిల్పకారుడు వచ్చి "నీలో ఏకాగ్రత శక్తి రాలేదు. నీలోని స్త్రీ వ్యామోహము పోలేదు.    రెండు లోపాలను ముందుగా సరిదిద్దిన తర్వాతనే నీవు శిల్పకళ (ఆధ్యాత్మికరంగము) నేర్చుకోవటములో ముందు అడుగు వేయగలవు" అన్నారు. 

2306.1994

నిన్నటిరోజున నా కుమార్తె ఆరోగ్యము విషయములో చాలా ఆందోళన చెందినాను.  ధైర్యమును ప్రసాదించమని శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అంటారు. "జీవితము ఒక లారీని నడపటమువంటిది.  బరువు బాధ్యతలును   లారీలో వేసుకొని ప్రయాణము సాగించాలి.  మనము ప్రయాణము చేసే మార్గములో యితర లారీలకు ప్రమాదాలు జరిగిన మనము అధైర్యము పడకుండ మన లారీని మన గమ్యస్థానానికి నడిపించుకొంటు వెళ్ళాలి."

30.06.1994

నిన్నటిరోజున ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనే తపనతో చాలామంది స్నేహితులతో మాట్లాడినాను.  కాని నాకు సంతృప్తి కలగలేదు.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నాకు సహాయము చేయమని వేడుకొన్నాను.  శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాకు కనువిప్పు కలిగించినవి.

"నా స్నేహితులు కొందరు పెద్ద పట్టణానికి వెళ్ళి అక్కడనుండి మిఠాయి పొట్లాలు తెచ్చి అమ్ముకొంటున్నారు.  నేను నా స్నేహితుల దగ్గరనుండి మిఠాయి పొట్లాలు కొని తినుచున్నాను.  విధముగా నేను కొన్న మిఠాయి పొట్లాలలో కల్తీ జరుగుతున్నదని గ్రహించినాను.  విధమైన కల్తీ మిఠాయి తినలేను ఏమి చేయాలి అనే ఆలోచనలు రాసాగినవి.  సమయములో పట్టణము (శిరిడీ) నుండి చింతామణి మిఠాయి దుకాణము యజమాని నా దగ్గరకు వచ్చి నీవు మధ్యవర్తుల దగ్గరనుండి మిఠాయి ఎందుకు కొంటావు నీవు మిఠాయి తినదలచుకొంటే చాలు, నన్ను తలచుకో నేను నీకు ప్రత్యక్షమై మిఠాయి యిస్థాను అంటారు.  అప్పటినుండి నాకు కల్తీ లేని మిఠాయి పట్టణము (శిరిడీ) నుండి లభించసాగినది.  మెలుకువ వచ్చినది.  ఒక్కసారి ఆలోచించినాను.  చింతామణి మిఠాయి దుకాణము యజమాని ఎవరు?   


నామనసులో ప్రశ్నకు సమాధానము "శ్రీసాయి" అని వచ్చినది.

01.07.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, "సాయినాధా రోజు గురువారము. ఆధ్యాత్మిక విషయాలు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను.  శ్రీ సాయి చూపిన దృశ్యాలు శ్రీ సాయి సత్చరిత్ర 15 . అధ్యాయములో శ్రీ సాయి అన్నమాటలు "సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును.  ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు.  నేను మీ చెంతనే యుండెదను" జ్ఞాపకము చేసినవి.  శ్రీ సాయి చూపిన దృశ్యాల వివరాలు.  నేను ఆఫీసుపని మీద బ్రెజిల్ దేశమునకు వెళ్ళినాను.  


అక్కడి ప్రజల భాష నాకు తెలియదు.  నా అదృష్ఠము కొలది  తెలుగుభాష, బ్రెజిల్ భాష తెలిసిన ఒక గైడు నాకు దొరికినాడు.  గైడు (శ్రీ సాయి) తెల్లని    ప్యాంటు, తెల్లని చొక్కా, తలపై తెల్లని తలపాగ (కుచ్చుల తలపాగ) ధరించి యున్నాడు.  నేను బ్రెజిల్ దేశములో ఉన్నంత కాలము నాకు తోడుగా యుండి చాలా సహాయము చేసినారు.  నేను తిరిగి భారత దేశమునకు బయలుదేరుతుంటే నాదగ్గరకు వచ్చి స్వచ్చమైన తెలుగు భాషలో  తిరిగి  భారత దేశములో కలుసుకొందాము అని అన్నారు.  నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది.  యిది అంత కల కదా అని ఆలోచించసాగినాను.  కలకు, నా జీవితానికి ఉన్న సంబంధము ఏమిటి అని  ఆలోచించినాను.  1991 మే నెల 6 .తారీకునుండి 20 . తారీకు వరకు నేను ఆఫీసు పనిమీద దక్షిణ కొరియా దేశమునకు వెళ్ళినాను.  అక్కడి సామి (SAMMI) కంపెనీలోని యింజనీరు శ్రీ లీ నాకు   చాలా సహాయము చేసినారు.  శ్రీ సాయి నాకు శ్రీ లీ రూపములో కొరియా దేశములో చేసిన సహాయమును బ్రెజిల్ దేశములో గైడు రూపములో చేసినట్లుగా చూపించి, తన భక్తులకు సహాయము చేయుటకు సప్త సముద్రాలుకూడా దాటగలను అని నిరూపించినారు.

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 

No comments:

Post a Comment