Monday 2 January 2012

శ్రీ రావాడ గోపాలరావుగారు


 05.01.2012  బుధవారము




శ్రీ రావాడ గోపాలరావుగారు బాబా వారి అనుగ్రహంతో 1989 లో సాయి భక్తునిగా మారారు. శ్రీ రావాడ వెంకటరావు, రావాడ రమణమ్మ పుణ్యదంపతులకు 24, ఏప్రిల్, 1946 లో ఆయన జన్మించారు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉండగా, బాబా వారు ఆయనకి "సాయిబానిస" అని పేరుపెట్టారు. అంటే దాని అర్థం "బాధ్యతలు నిర్వర్తించే సన్యాసి"

బాబావారి సూచనల ప్రకారం ఆయన 25.12.1998 నుంచి  సాయి తత్వాన్ని చాలా చురుకుగా విస్తృతంగా యింటర్నెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.  saidarbar.org  ఆయన ఫౌండర్ మెంబరు. భారత ప్రభుత్వంలో సైంటిఫిక్ ఆఫీసరుగా పని చేస్తూ తన 54 ఏట స్వచ్చందంగా పదవీ విరమణ చేసి సాయి  సేవకి, సాయి భక్తులకి అంకితమయారు. బాబా ఆయనకి తమ అనుగ్రహాన్ని అందచేశారు.  ఆయనకి స్వప్నాలలో ఏసందేశాలిచ్చినప్పటికీ వాటిని వర్గీకరించి సాయి తత్వంగా అందించారు.  సాయిదర్బార్ ద్వారా ఆయన ఇచ్చిన సాయి సందేశాలు యెంతో ప్రజాదరణ పొందాయి

ఆర్గనైజర్స్ యొక్క ఆహ్వానం మీద ఆయన, నవంబరు 22-25, 2000 సంవత్సరంలో చికాగో,   అక్టోబరు, 4-5, 2003 సంవత్సరంలో ఓర్లాండొ, ఫ్లోరిడా, యూ.ఎస్.. లో జరిగిన సాయి ఉత్సవ్ లకి  హజరయారు.  అయిదు ఖండాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 సాయి దర్బార్ సభలకి ఆయన ముఖ్య సేవకుడు.  వాటి ప్రధాన కార్యాలయం విశ్వసాయి దర్బార్ లండన్ యూ.కే. లో ఉంది.

సాయి బానిస గోపాలరావు రావాడగారు ఆధ్యాత్మికోపన్యాసాలు క్రింద వివరించిన విషయాలమీద ఆంగ్లములోను, తెలుగులోను ఇచ్చారు.


1.  స్వప్నంలో సాయి -  శాస్త్రీయతకు దగ్గరగా 

2.  భాగవతంలో సాయి

3.  రామాయణంలో సాయి

4.  సాయి సంపూర్ణ దత్తవతారం

5.  సాయి తత్వం

6.  జీవితం మీద సాయి దృక్పధం

7.  దంపతులకి సాయి సలహా

8.  సాయిబానిసావారి స్వప్నాలలో సాయి

9.  సాయితో సాయిబానిసావారి అనుభవాలు

10. తన భక్తుల జీవితాలలో సాయి

11. సాయి చెప్పిన మాటల అంతరార్థాలు

12. సాయి, మరియు పూర్వకాలపు సత్పురుషులు

13. భగవంతుడు సత్యం - సాయి సత్యం

14. నా సమాథినుండి నా ఎముకలు మాట్లాడతాయి - బాబా

సాయిబానిసా వారి ముఖ్యోద్దేశ్యం

"షిరిడీ సాయి భక్తుల హృదయంలోనే సాయి ఉన్నారని వారికి తెలియచేసి వారికి సహాయం చేయడం". 

1 comment:

  1. SaiRam,
    Baba's Blessings to orgnisers of this blog for giving more and more information on Lord Sainath of Shirdi, Useful to all Telugu saidevotees across the Globe,
    SaiSevak SrinivasaRao Kasturi.

    ReplyDelete