Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డరీ - 1993 20వ భాగము

సాయి.బా.ని.స. డరీ - 1993 20వ భాగము సాయి.బా.ని.స. డైరీ - 1993 29.10.1993 నిన్న రాత్రి మానసిక బాధతో శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నీవు నా కష్ఠాలులోను, నా సుఖాలులోను నాకు తోడుగా ఉన్నావనే అనుభూతిని ప్రసాదించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి ప్రసాదించిన దృశ్యము నన్ను చాల సంతోషపరిచినది. అది ఒక చెఱువు. నేను మానసిక బాధతో ఆ చెఱువులో ఈత కొడుతున్నాను. యింకొక వ్యక్తి జ్వరముతో శారీరక బాధతో ఆ చెఱువులో ఈత కొడుతున్నాడు. మమ్మలనిద్దరిని ఓ వయసు మళ్ళిన వ్యక్తి గట్టుపై నిలబడి చిరునవ్వుతో చూస్తున్నాడు. ఆ వ్యక్తి మమ్మలనిద్దరిని గట్టుపైకి రమ్మనమని సైగ చేసినారు. ఆవ్యక్తి అన్నారు "నా కరుణాసగరములో మానసిక జ్వరముతోను, శారీరక జ్వరముతో బాధ పడేవారు ప్రశాంతముగా ఈత కొట్టవచ్చును. ఈత కొట్టి అలసి పోయినపుడు వాళ్ళను నేను జాగ్రత్తగా గట్టు ఎక్కించుతాను". నేను సంతోషముతో ఆయనను దాదాజి (తాతగారు) అని పిలుస్తాను. ఆయన కోపముతో నేను ముసలివాడిని కాను. నా వయస్సు నీకు తెలియదులే అన్నారు. ఆయన కోపము నాకు కొంచము భయము కలిగించినది. నిద్రనుండి లేచిపోయినాను. యిది అంత కల కదా - శ్రీ సాయి కలలో నా కష్ఠ సుఖాలలో నాకు తోడుగా ఉంటానని చెప్పినారు కదా అని సంతోషించినాను. 02.11.1993 నిన్న రాత్రి శ్రీ సాయి ముగ్గురు స్త్రీల రూపములో దర్శనము యిచ్చినారు. వాటి వివరాలు. నీ మనసుకు ఆనందము కలిగించే నీ కుమార్తె రూపములో ఉన్నాను. నీ కష్ఠ సుఖాలలో పాలు పంచుకొనే నీ భార్య రూపములో ఉన్నాను. లక్షలాది అనాధ బాల బాలికల బాధ్యత వహించుతున్న మదర్ థెరీసా రూపములోను ఉన్నాను - అన్నారు. 11.11.1993 నిన్నటి రోజు ప్రశాంతముగా గడచిపోయినది. శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నాలో ద్వేషము అనే గుణమును వదిలించుకొనే మార్గము చూపుమని వేడుకొన్నాను. శ్రీ సాయి చక్కని దృశ్యము చూపినారు. ఆ దృశ్య్లము చూసిన తర్వాత కనువిప్పు కలిగినది. నేను ఉదయము వేళ బ్రష్ తో పండ్లు తోముకుంటున్నాను. నేను ఆ మలినాన్ని బయటకు ఉమ్మి వేయకుండ మ్రింగుతున్నాను. పండ్లు శుభ్రపడినాయి కాని ఆ మలినము శరీరములోనే యున్నది. ఆ మలినాన్ని మ్రింగితే భయంకరమైన జబ్బులు వస్తాయి అంటారు ఓ అజ్ఞాత వ్యక్తి. నిద్రనుండి లేచి ఆలోచించినాను. ద్వేషము అనే మలినాన్ని మన మనసునుండి తీసి పారవేయాలి. లేకపోతే ఆ మలినము మన పతనానికి నాంది పలుకుతుంది అని గ్రహించినాను. ఆ అజ్ఞాత వ్యక్తి యింకా అన్నారు. సద్గురువు యొక్క ప్రేమ అభిమానాలు పొందియుండి కూడ జీవితము అనే రోడ్డుపై గోతులను చూసి ప్రక్కనుండి వెళ్ళకుండ ఆ గోతిలో పడితే అది సద్గురువు యొక్క తప్పుకాదు. అది శిష్యునిలో యింకా మిగిలియున్న అహంకారము అని గుర్తించు. 12.11.1993 నిన్నటి రోజు గురువారము. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ, నీగురించి వివరముగా చెప్పు బాబా" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కృష్ణుని రూపములో దర్శనము యిచ్చి "తనకు తన భక్తుల మధ్య ఉన్న ప్రేమ రాధా కృష్ణల ప్రేమవంటిది" అన్నారు. తన భక్తులు తలపెట్టిన మంచి కార్యాలు నిర్విఘ్నముగా జరగటానికి ఆశీర్వదించే శ్రీ విఘ్నేశ్వరుడిని నేనే" అన్నారు. 13.11.1993 నిన్నటి రోజున ధనవ్యామోహముపై చాలా ఆలోచించినాను. నాలోని ధన వ్యామోహమును తొలగించు బాబా అని ప్రార్ధించి నిద్రపోయినాను. కలలో ఒక అజ్ఞాత వ్యక్తి అన్నారు. "నీ యింటిలోని పూజగదిలో (మనసులో) పూజా సామానులతో నిండియుంది. కాని యింకా పూజ ప్రారంభించలేదు నీవు - అందుచేతనే యింకా ఈ వ్యామోహాల వలనుండి బయట పడలేదు" (యింకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment