శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
11. జీవితము కొబ్బరి చెట్టులాగ పెరిగి
సంఘానికి ఉపయోగపడాలి. అంతేగాని సీమచింత చెట్టులాగ ఎదిగి ఏమి చేయాలి?
శిరిడీ సాయి 10.12.92
12. జీవితము పచ్చటి వరిపైరులాగ ప్రతి సంవత్సరము పంటలు పండించుతూ సంఘానికి
ఉపయోగపడాలి. ఒకసారి రాయి త్రవ్విన తర్వాత పనికి
రాని రాతిగ మారితే ఎవరికి ఉపయోగము?
శిరిడీ సాయి 10.12.92
13. జీవితము కష్ట సుఖాల మయము. నీవు
సుఖమును సంతోషముగా కోరినప్పుడు కష్టాలను కూడ నీవు సంతోషముగా స్వీకరించాలి.
శిరిడీ సాయి 13.12.92
14. జీవితము అనే నదికి ప్రతిరోజు పండగే.
ఈ పండగలో జనాలు స్నానానికి వస్తూ పోతూ ఉంటారు. ఈ జన సమ్మేళనలో మితృలు కలుస్తారు. శతృవులు ఎదురు
అవుతారు. అందరితోను కలసి మెలసి తిరగాలి తప్పదు.
శిరిడీ సాయి 01.06.93
15. జీవితములో బంధాలు తెంచుకోవటము అంత సులభము కాదు. నీ విధి, నీబాధ్యతలను నీవు నిర్వర్తించు.
శిరిడీ సాయి 17.12.92
16. జీవితము ఒక కుస్తీ పోటీ వంటిది. మనము తప్పుడు కుస్తీ ఆడిననాడు రిఫరీ (భగవంతుడు)
మన చేతులకు సంకెళ్ళు వేసి మన చేత కుస్తీ ఆడించుతూ మన ప్రత్యర్థుల చేతనే మనలను చితకబాదించి
మనకు ఉన్న అహందారము వదలిపోయేలాగ చేస్తాడు.
జాగ్రత్త.
షిరిడీ సాయి 04.01.93
17. జీవితము అనే రైలు ప్రయాణములో
భార్య, పిల్లలు నీతొటి ప్రయాణీకులు, నీవు, ఒక సారి రైలు దిగిపోయి యింకొక రైలు (ఆధ్యాత్మిక రైలు) ఎక్కడానికి
ప్రయత్నము చేయవచ్చును. కాని, నీ తోటి ప్రయాణీకులు
నీకు తోడుగా ఆధ్యాత్మిక రైలులో ప్రయాణము చేయటానికి రారు అని తెలుసుకో.
షిరిడీసాయి 06.01.93
18. జీవితములో లేనిది ముఖ్యము కాదు
- ఉన్న దాంట్లో తృప్తి ఉన్నదా లేదా అనేది ముఖ్యము.
షిరిడీసాయి 16.12.92
19. జీవితములో ఆఖరి రోజులు భార్యతో
పాత కారులో ప్రయాణము వంటిది. రోడ్డుకు అడ్డముగా
మనవలు చేసే చిలిపి అల్లరి - రోడ్డు ప్రక్కన అమ్మబడే తినుబండారాలు తినాలి అనే జిహ్వ
చాపల్యం నీ ప్రయాణానికి ఆటంకాలు జాగ్రత్త.
షిరిడీసాయి 07.01.93
20. జీవితము సాథుజంతువులతో కూడిన
అభయారణ్యము. ఆ సాథుజంతువులను జాగ్రత్తగా కాపాడాలి. వాటిని కష్ట పెట్టి పరుగులు తీయిస్తే ఎలుగుబంటి
వచ్చి వాటిని చంపటానికి ప్రయత్నించుతుంది.
అపుడు నీవు ఎలుగుబంటిని చంపడానికి నానా పాట్లు పడాలి. ఎందుకువచ్చిన ఈ పాట్లు. హాయిగా సాథుజంతువులను కాపాడుకో.
షిరిడీ సాయి 07.01.93
No comments:
Post a Comment