Sunday 29 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (17)

సాయి.బా.ని..  డైరీ - 1994  (17)

28.05.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, సాయిబంధువులకు సందేశము ప్రసాదించు తండ్రీ అని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు




"నీ యింట అందరి  కడుపు నింపటానికి బియ్యము బస్తా మోస్తున్న అకూలీవానిని చూడు.   


వాడి యింట కనీసము గంజి త్రాగటానికి బియ్యము నూకలు ఉన్నాయా లేవా అని ఎప్పుడైన ఆలోచించినావా - కూలివాడి కష్ఠాన్ని  మాత్రము ఉంచుకోకు".  మాటలకు ఉలిక్కిపడి లేచినాను.  ఒక్కసారి నామనసు శ్రీ సాయి సత్ చరిత్ర 18 - 19 అధ్యాయములలో శ్రీ సాయి కష్ఠమునకు కూలి అనే విషయములో సాయి అన్న మాటలు "ఒకరి కష్ఠమునింకొకరుంచుకొనరాదు.  కష్ఠపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగా యివ్వవలెను" జ్ఞాపకమునకు వచ్చినవి.   

29.05.1994

నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "శ్రీ సాయి తత్వము గురించి చెప్పమని వేడుకొన్నాను.  రాత్రికలలో శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి కంఠముతో అన్నమాటలు యింకా నా చెవిలో వినబడుతున్నవి.  మాటలు "నా పేరిట అన్నదానము ఎక్కడ జరుగుతుంటే అక్కడ నేను ఉంటాను".  ఉదయము నిద్ర లేచిన తర్వాత శ్రీ సాయి చెప్పిన ఆమాటలు మననము చేసుకోసాగినపుడు శ్రీ సాయి సత్చరిత్ర 38 . అధ్యాయములో వవరింపబడిన సంఘటన "శ్రీ సాయి స్వయముగా తన చేతులతో భోజనము తయారుచేసి తనభక్తులకు వడ్డించేవారు" గుర్తుకు వచ్చినది.

15.06.1994

నిన్నటిరోజున ఆఫీసులో స్నేహితులతో భేద అభిప్రాయాలు వచ్చినవి.  రాత్రి నిద్రకు ముందు శ్రీ  సాయికి నమస్కరించి "ఎటువంటి స్నేహితులకు దూరంగా యుండాలి" అనేది చెప్పమని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి యిచ్చిన సందేశము వివరాలు.

1) రాత్రి వేళ పరుల మేకను కోసేవాడి నుండి దూరంగా ఉండాలి.

2) మూడు గాడిదలతో అరక కట్టి పొలం దున్నేవాడినుండి దూరంగా ఉండాలి.  రెండు సందేశాలకు అర్థము ఆలోచించినాను.  రాత్రి వేళ పరుల మేకను (ధనాన్ని) కోసేవాడు (దొంగిలించేవాడు) తో స్నేహము చేయరాదు.  మూడు గాడిదలు (అబధ్ధము) (బధ్ధకము)  (దొంగతనము) లను ఉపయోగించుకొని జీవించేవాడితో స్నేహము చేయరాదు.  నిద్రనుండి మేల్కొని శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలియచేసినాను. 

20.06.1994

నిన్నటి రోజున శ్రీ సాయి పేరిట ధనము సంపాదించాలి అనే ఉత్సాహముతో నా మితృల సహాయము అర్ధించినాను.  నాకు అన్ని చోట్ల నిరుత్సాహము కలిగినది.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ - సాయి.బా.ని.. గా నేను ఎవరి దగ్గర ధన సహాయము కోరని పరిస్థితిని, మరియు నీసేవ నిమిత్తము స్వశక్తి మీద ఆధారపడే పరిస్థితిని ప్రసాదించు" అని  వేడుకొన్నాను.  శ్రీ సాయి రాత్రి కలలో చూపిన దృశ్యాలు నాకు కనువిప్పు కలిగించినవి.  (1) ఒక  ప్రదేశములో రోడ్డుమీద చిన్నతోపుడు బండి మీద కూరలు అమ్మకము జరుగుతున్నది.  కూరలు అమ్మేవ్యక్తి తోపుడు బండిని రోడ్డు మీద తోసుకుంటు కూరలు కావలసిన వారికి కూరలు అమ్ముతూ  ధనము సంపాదించుకుంటున్నాడు.   


యిందలి విచిత్రము ఏమిటి అంటే కూరలు అమ్మే వ్యక్తి అదృశ్య రూపములో ఉన్నారు.  కాని ఆయన చేతులు మాత్రము కనిపించుతున్నాయి.  శ్రీ సాయి ఈవిధమైన  దృశ్యము ద్వారా తెలియ చేసినది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినాను. "కష్ఠపడి రెండు చేతులతో పని చేసి డబ్బు సంపాదించాలి" ధనముతో జీవితము గడపాలి.  మరి శ్రీ సాయి చూపిన రెండవ దృశ్యము ఒక వ్యక్తి కష్ఠపడి సైకిలు త్రొక్కుతున్నాడు.  సైకిలుకు ఒక డైనమో  లైటు యుంది.  వ్యక్తి సైకిలు త్రొక్కుతు చీకటి ప్రదేశాలలొ తన సైకిలు డైనమో లైటును కేంద్రీకరించుతున్నాడు.   


మరి యిటువంటి దృశ్యము ద్వారా శ్రీ సాయి తెలియచేసినది ఏమిటి అని ఆలోచించినాను.  నీవు నీ జీవత ప్రయాణములో సంపాదించిన జ్ఞానము అనే కాంతితో  అజ్ఞానము అనే చీకటిని తొలగించు" అదే విధముగా శ్రీ సాయి సేవ చేసుకొని జీవించాలి.    రెండు దృశ్యాల ద్వారా శ్రీ సాయి సేవకు ఎవరినుండి ధన సహాయము కోరరాదు.  మరియు మనకు ఉన్న శక్తితో శ్రీ సాయి సేవ చేసుకోవాలి అని నిర్ణయించుకొన్నాను.

(యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 


No comments:

Post a Comment