Monday 2 January 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి 

31.  జీవితము ఒక క్రికెట్ ఆట వంటిది.  నీవు బౌలింగ్ చేస్తూ ఉంటే నీ పిల్లలు ఎప్పుడు బ్యాటింగ్ చేస్తూ సెంచరిల్లు కొట్టి ఆటనుండి విరమించుకొంటారు.  నీవు బ్యాటింగ్  చేయాలి అనే ఉద్దేశ్యముతో నీ పిల్లలను బౌలింగ్ చేయమంటే వారు బౌలిగ్ చేయటానికి చికాకు పడతారు.  నీవు నీ జీవితములో ఏవిథమైన పరుగులు చేయకుండానే ఆటలో మిగిలిపోతావు.

                                                                                                                                                   17.08.95 

32.  జీవితములో థన సంపాదన చేసి ఇనుప పెట్టెలో జాగ్రత్తగా దాచుకొని నీ జీవిత అవసరాలు కోసము ఆ ధనాన్ని జాగ్రత్తగా వాడుకో.  అంతే గాని ఆ ఇనుపపెట్టి తాళాలు మాత్రము నీ పిల్లల చేతికి ఇచ్చినావో - వృధ్ధాప్యములో నీకు మిగిలేది చికాకులు మాత్రమే అనేది గుర్తుంచుకో.

                                                                                                          17.08.95

33.  జీవిత ప్రాయాణములో వెలుతురు, చీకటి వస్తాయి.  చీకటి ప్రయాణములో సమర్థ సద్గురువు అనే దీపాన్ని నీతోడుగా తీసుకొని ప్రయాణము సాగించునపుడు, ఆ దీపపు కాంతిలో నీ విరోధి కూడ మితృడులాగ కనబడతాడు.  నీ గమ్యాన్ని నీవు  ప్రశాంతముగా  చేరగలవు.

                                                                                    05.09.95

34.  జీవితములో దుర్వ్యసనాలకు దూరంగా యుంటు, ధర్మాన్ని పాటిచుతూ ధన సంపాదన కొనసాగించుతూ ఇతరుల విషయాలలో కలుగచేసుకోకుండా పేరు ప్రఖ్యాతులు కోసము ఎదురుచూడని రోజున నీవు ఆధ్యాత్మిక రంగములో ప్రవేశించినట్లే. -  నీవు నీ భార్యలోను, నీ తల్లిలోను నన్ను చూడగలిగిన రోజున నీవు ఆధ్యాత్మిక రంగములో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లే.

                                                                                    11.04.96

35.  జీవితములో ధనమే ముఖ్యము కాదు.  ధన గర్వముతో నీ వాళ్ళను దూరం చేసుకుంటే ఆఖరి రోజులలో నీ జీవితము ప్రాణం ఉన్న శవములాగ తయారు అగుతుంది.

                                                                                   28.01.93

36.  జీవితాన్ని ఒక యంత్రముతో పోల్చవచ్చును.  యంత్రము పని కాలము పూర్తి అయినతరువాత దానికి మరమ్మత్తులు చేయలేక ఆ యంత్ర భాగాలని వేరు చేసి కొలిమిలో కరగపెట్టి తిరిగి ఇనుప దిమ్మలగా చేసి నూతన యంత్రాలుగా మార్చుతారు.  అదే విధముగ భగవంతుడు సృష్టించిన ఈ శరీరము ఒకనాడు మట్టిలో కలసిపోయి  తిరిగి ఆ మట్టి నుండి నూతన జన్మ ఎత్తవలసినదే.

                                                                                   01.07.96

37.  జీవిత ప్రయాణములో నీ తోటి ప్రయాణీకులతో చక్కగా మాట్లాడుతూ (భార్య పిల్లలతో జీవించుతూ) చిన్న చిన్న విషయాలపై గొడవలు పడి వారికి చెప్పకుండా దూరముగా వెళ్ళిపోవడము మంచి పధ్ధతి కాదు.  నీవు జీవితములో నీ తోటి ప్రయాణీకులకు దూరముగా ఉండదలచిన,  వారికి ఆ విషయము చిరునవ్వుతో చెప్పి వారినుండి దూరముగా వెళ్ళిపో.

                                                                                    17.07.96

38.  జీవితములో బరువు బాధ్యతలు ఆఖరి వరకు ఉంటాయి అని గ్రహించి  దాని ప్రకారం నడచుకొనువాడు తెలివైనవాడు.  జీవితములో మమతలు మమకారాలు మధ్య కొట్టు మిట్టాడుతూ ఆఖరి శ్వాసవరకు జీవించువాడు తెలివిహీనుడు.

                                                                                     19.07.96

39.  జీవితములో ఎన్నిసార్లు గంగాస్నానము చేసినాము అనేది ముఖ్యము కాదు.  నీ మన్సులోని మురికి ఎంతవరకు శుభ్రము చేసుకొన్నావు అనేది ముఖ్యము.

                                                                                     08.08.96

40.  జీవితములో తెల్లని వస్త్రాలు ధరించటము అంటే సుఖశాంతులు కోరటము - మరి ఆ తెల్లని వస్త్రాలపై మురికి చేరటము అంటే కష్టాలు కొనితెచ్చుకోవటము.  ఆ మురికిని సద్గురువు సహాయంతో మనమే శుభ్రము చేసుకొని సుఖశాంతులతో నిండిన  జీవితాన్ని గడపాలి.

                                                                                     19.09.96

No comments:

Post a Comment