Monday, 2 January 2012

సాయితో సాయిబానిస అనుభవాలు - 3


సాయితో సాయిబానిస అనుభవాలు - 3
ప్రతీ వారి జీవితంలో కష్టాలు సుఖాలు సాధారణం. కష్ట సమయాలలోనే భగవంతుడిని గూర్చి ఆలోచించడం సర్వసాధారణం. అన్ని విషయాలలోనూ శ్రీ సాయిబాబా యెల్లప్పుడూ నాయందు చాలా దయతోఉన్నారు. సాయిబానిసాఅనుభవాల క్రమంలో ఇది మూడవది. ప్రతీ భక్తుడు మొదటి అనుభూతిని మరవడం అరుదు, నేను దీనికిమినహాయింపు కాదు. 1989 కి ముందు నాకు యిటువంటి సత్పురుషుని గురించి తెలియదు. అప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలలలో, నా స్నేహితులలో ఒకరు నాకు సాయి పటాన్ని బహుమతిగా ఇచ్చారు. యెంతోభక్తితో నేను దానినినా పూజా గదిలో ఏర్పాటు చేసి పెట్టాను. సాయి వదనంలోని చిరునవ్వు నన్నెంతో సమ్మోహితుడ్ణి చేసింది. అది వెంటనేతనవైపుకు లాక్కుని ఇక అప్పటినుంచి నా మనస్సులో శాశ్వతమయింది. నాకు ప్రతీ శనివా రమూ D A E కాలనీలోని ఆంజనేయస్వామి గుడికి, పోచమ్మతల్లి గుడికి వెళ్ళడం అలవాటు. రోజులు గడుస్తున్నాయి. నా స్నేహితుడు శ్రీభోన్స్ లే గారి సలహామీద 1989 జూలై నెలలో షిరిడీ వెడదామనుకున్నాను. జూలై నెలలో ఒక శనివారము ఉదయమునాలుగు రూపాయలు జేబులో వేసుకుని ఆంజనేయస్వామి గుడికి పోచమ్మ తల్లి గుడికి బయలుదేరాను. ఆంజనేయస్వామి గుడిలో పూజారికి ఆరతి అనంతరమురెండు రూపాయలు ఇచ్చాను, గుడి బయట వేప చెట్టుకిందఉన్న ఒక వృధ్ధురాలికి ఒక రూపాయి ఇవ్వదలచినాను. కాని ఆమె ప్రక్కన ఖాకి నిక్కరు ఖాకి చొక్కా తలకి తెల్లటివస్త్రము భుజాన తెల్లటి జోలి చేతిలో డాల్డా డబ్బా ఒక పొట్టి కఱ్ఱతో ఉన్న ఒక వృధ్ధుణ్ణి చూశాను. అతను కూడా నానుండిభిక్షను అడిగినాడు. వేప చెట్టుకింద ఉన్న ముసలామెకు, వృధ్ధుడికి చెరొక రూపాయి ఇచ్చి పోచమ్మ తల్లి గుడికివెళ్ళి, పోచమ్మ తల్లికి నమస్కరించి యింటికి బయలుదేరాను.. పోచమ్మ తల్లి దర్శనం చేసుకుని యింటికి వెళ్ళుతూవెనక్కి తిరిగి వృధ్ధుణ్ణి చూశాను. అతను నేనిచ్చిన రూపాయి నాణాన్ని చేతితో రుద్దుతూ చిరునవ్వు చిందించసాగినాడు. నేను యింటికి చేరుకుని నా పూజా మందిరములోని సాయి పటమును చూసినాను. పటములోనిచిరునవ్వు వృధ్ధునియొక్క చిరునవ్వు ఒకే విథముగా ఉండుట చేత తిరిగి వేప చెట్టు దగ్గిరకి వచ్చినాను. నేను వేపచెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి వృధ్ధుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడని గమనించాను. వృధ్ధురాలితో ఖాకీ నిక్కరుఖాకీ చొక్కా ధరించిన వృధ్ధుడిని గురించి అడిగినాను. ఆమె వృధ్ధుడు ఖాకీ నిక్కరు ఖాకీ చొక్కా ధరించలేదనీ, ఒకతెల్లని కఫనీ మాత్రమే ధరించి ఉన్నడనీ ఆమె చెప్పినది. ఆమె చెప్పిన వర్ణన శ్రీసాయిబాబా రూపముతో పోలియుండుటచేత ఆమె అదృష్టవంతురాలని భావించి శ్రీ సాయి ముసలివాని రూపములో వచ్చి నా నుండి ఒక రూపాయి దక్షిణస్వీకరించి నన్ను ఆశీర్వదించారని భావించాను.
. విలక్షణమైన చిరునవ్వుతో నావద్దనించి దక్షిణ తీసుకున్న అతను నాసాయి, మొదటిసారే నేను నా సాయినిగుర్తించడంలో విఫలమయ్యాను. నేను నా స్కూటర్ మీద పిచ్చివాడిలా D A E కాలనీలోని వీథులన్ని తిరిగాను కాని నా సాయి నాకెక్కడా కనపడలేదు. అదేరోజు మధ్యాహ్న్నం మూడు గంటలకి నేను నా మితృడు భోన్స్ లే షిరిడీకిబయలుదేరాము. మరునాడు ఉదయం (ఆదివారం) మేము షిరిడీ చేరుకున్నాము. సమాధి మందిరములోనే బాబాకికన్నీళ్ళతో ముకిళిత హస్తాలతో నమస్కరిస్తున్నప్పుడు ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్కా ధరించిన సాయినాధులవారు నన్నుఆశీర్వదించారు. ఆనాటినుండి నేటి వరకు నా ప్రతి చిన్న పెద్ద విషయాలలో సాయి నాకు తోడుగా ఉండి నిరంతరముసహాయం చేయుచున్నారు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment