Wednesday, 4 January 2012
సాయి.బా.ని.స. డైరీ - 1993 19 వ. భాగము
సాయి.బా.ని.స. డైరీ - 1993 19 వ. భాగము
సాయి.బా.ని.స. డైరీ - 1993
23.10.1993
నిన్నటి రోజున మనసులో చాలా చికాకు పడినాను. జీవితములో తప్పు పనులు చేసినాను. వాటివలన చికాకులు కలుగుతున్నాయి. వాటినుండి బయటపడాలి. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో వచ్చి నీ పెద్ద తండ్రి (నా తండ్రి అన్నగారు) చాలా డబ్బు అక్రమమార్గాలలో సంపాదించినారు. ఎంత డబ్బు సంపాదించిన ఆ డబ్బును దుబారా చేసి ఆఖరికి చనిపోయే సమయములో చేతిలో చిల్లి గవ్వలేని స్థితిలో చనిపోయినారు. ఆయన జీవితాన్ని చూసి నీవు అటువంటి పొరపాట్లు చేయకుండ జీవించు". శ్రీ సాయి నా బంధువులలో ఒక స్త్రీని చూపించి "ఆమె చెడు ప్రవర్తనతో ఆ కుటుంబ పరిస్థితి అస్థవ్యస్థ అయినది" అన్నారు. యిటువంటి పనులు నీవు చేయకుండాయుంటే చాలు. నీభవిష్యత్ లో నీకు చికాకులు యుండవు" అని శ్రీ సాయి అన్నారు అని భావించినాను.
25.10.1993
నిన్న రాత్రి కలలో శ్రీ సాయి యిచ్చిన సందేశము "ఎంతటి ఖరీదు అయిన కూరగాయలనైన సులువుగా జీర్ణము అవటానికి ఉడికించి తినవలసినదే, పచ్చి కూరగాయలు తినలేము కదా - అలాగే ఎంతటి గొప్పమతములో జన్మించినా భగవంతుని తెలుసుకోవటానికి సాధన చేయవలసియుంటుంది. ఆ సాధన విధానము నేను చెబుతాను యిష్ఠము యుంటే తెలుసుకో - శ్రీ సాయి.
26.10.1993
నిన్నటిరోజున శ్రీ సాయి తత్వప్రచారము విషయములో నేను సరి అయిన మార్గములో నడుస్తున్నది లేనిది తెలపమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను సంతోషపరిచినది. "నేను నా ఆఫీసు బస్సు కోసము నిలబడినాను. యింతలో నా ఆఫీసు ప్రక్కన ఉన్న ఫ్యాక్టరీ బస్సు వచ్చినది. ఆబస్సులో ఎక్కటానికి ఆ బస్సును ఆపినాను. ఆ బస్సులోనివారు అందరు మీ ఆఫీసు యజమాని పేరు చెప్పి బస్సు ఎక్కండి అన్నారు.
నేను సంతోషముగా నా యజమాని శ్రీ ఐ.వీ.ఖాన్ అని చెప్పినాను. ఆ బస్సులోనివారు అందరు సంతోషముతో నన్ను వారి బస్సు ఎక్కించుకొని నా ఆఫీసు దగ్గర దించినారు. తెల్లవారిన తరవాత ఈ కల గురించి ఆలోచించినాను. నాకు శ్రీ సాయి అనేక సార్లు మా పెద్ద ఆఫీసరు శ్రీ ఐ.వీ.ఖాన్ రూపములో దర్శనము యిచ్చినారు. కలలో కనిపించిన బస్సు, అందలి ప్రయాణీకులు భగవంతుని భక్తులు. నేను నా యజమాని ఐ.వీ.ఖాన్ (శ్రీ సాయి) పేరు చెబితే వారు సంతోషముగా ఆబస్సులో ఎక్కనిచ్చినారు. అంటే శ్రీ సాయి తత్వము మరియు శ్రీ సాయి పేరు భగవంతుని భక్తులకు ఆమోదము అని గ్రహించినాను. శ్రీ సాయి తత్వము ప్రచారములో నేను సరి అయిన మార్గములో నడుస్తున్నాను అనే అనుభూతిని పొందినాను.
28.10.1993
నిన్నటిరోజున శ్రీ ఆర్థర్ ఆస్ బరన్ సాయి రామచరిత్ర అనువాదము కష్ఠము అనిపించినది. నేను చేస్తున్న అనువాదములో తప్పులు లేకుండయుండేలాగ ఆశీర్వదించమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము నన్ను సంతోషములో ముంచివేసినది. శ్రీ సాయి ఒక పెద్ద కంపెనీ యజమాని రూపములో తెల్లని సూటు ధరించి, తెల్లని కారులో నాయింటికి వచ్చి, నన్ను నా భార్యను పెద్ద హోటల్ కు రాత్రి భోజనానికి తీసుకొని వెళ్ళినారు. నా భార్య తనకు కావలసిన పదార్ధాలను తెప్పించుకొని తినసాగినది. ఆ పెద్ద కంపనీ యజమాని నాకు మత్తు పానీయాల లిస్టు యిచ్చి నాకు కావలసిన మత్తుపానీయము తెప్పించుకొనమని చెప్పినారు. నేను శ్రీ సాయి భక్తునిగా మారిన రోజునుండి మత్తుపానీయాలు త్రాగడము మానివేసినాను అని ఆయనకు చెప్పినాను. ఆయన నాలోని మంచి పట్టుదలకు సంతోషించి తను, నాకు తనకు త్రాగటానికి మంచి పానీయము ఆర్డర్ చేస్తానని చెప్పి అక్కడయున్న సర్వరుని పిలిచి రెండు పెద్ద కప్పుల "బ్రోస్" పానీయము తీసుకొని రమ్మనమని చెప్పినారు. నా భార్య చక్కగా భోజనము చేయసాగినది. ఆ సర్వరు రెండు పెద్ద కప్పులలో వేడి వేడి బ్రోస్ పానీయము తెచ్చినాడు. ఆ పెద్ద కంపెనీ యజమాని మరియు నేను ఆ వేడి పానీయము త్రాగటము ప్రారంభించినాము. వేడి పానీయము నాలికకు తగలగానే నాకు నిద్రనుండి తెలివి వచ్చినది. నేను పెద్ద హోటల్ లో లేను. నాభార్య నా మంచము ప్రక్క మంచముపై ప్రశాతముగా నిద్రపోవుచున్నది. ఆ పెద్ద కంపెనీ యజమాని లేరు. యిది అంత కలకదా అని అనిపించినది. కాని ఆ బ్రోస్ అనే పానీయము గురించి ఆలోచించుతు మరసటిరోజున నా స్నేహితులను చాలా మందిని అడిగినాను. అటువంటి పానీయము తాము ఎవరు త్రాగలేదని చెప్పినారు. అయినా శ్రీ సాయి రాత్రి కలలో పెద్ద కంపెనీ యజమాని రూపములో దర్శనము యివ్వటము నిజము అయనట్లు అయితే బ్రోస్ అనే పానీయము యివ్వటము కూడ నిజము అని తలచినాను. నా స్నేహితులు బ్రోస్ అనే పదానికి అర్ధము చెప్పలేకపోవటముతో నాదగ్గర ఉన్న చాంబర్స్ ట్వెంటీయత్ సెంచురీ డిక్షనరీ చూసినాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయినాను. బ్రోస్ అనేపదమునకు అర్ధము "ఏ సింపుల్ అండ్ న్యూట్రిషస్ ఫుడ్, మేడ్ బై పోరింగ్ బాయిలింగ్ వాటర్ ఆర్ మిల్క్ ఆన్ ఓట్ మీల్" అని ఉంది. తెలుగులో చెప్పాలి అంటే గంజి అని అర్ధము. శ్రీ సాయినాధుడు నాపై కరుణించి గంజిని ప్రసాదించి నాయింట భోజన పదార్ధాలకు లోటు యుండదని ఆశీర్వదించినారు. మరియు ఆర్థర్ ఆస్ బర్న్ యింగ్లీషులో వ్రాసిన పుస్తకమునకు తెలుగు అనువాదము చేయటములో యింగ్లీషు డిక్షనరీ సాయము తీసుకో అనే సలహా యిచ్చినారు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment