శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
21. జీవితములో నీవు ఒక రిక్షాలాగేవాడివి. నీ భార్య పిల్లలు నీ రిక్షా ఎక్కుతారు. నీకు ప్రేమ అనురాగాలు అనే డబ్బు ఇచ్చి నీ రిక్షా
నుండి దిగిపోతారు. నీలో ఓపిక తగ్గిపోతుంది. అపుడు నేను నిన్ను నీ రిక్షాలో కూర్చుండబెట్టుకొని
రిక్షాలాగి నిన్ను నీ గమ్యము చేర్చుతాను.
షిరిడీ సాయి 12.01.93
22. జీవితము అనే లోహాన్ని కష్టాలు
సుఖాలు అనే అగ్నిలో కాల్చబడని సమ్మెట దెబ్బలు తగలనీ. దాని తర్వాత సాయి అనబడే ద్రావకములో ముంచి తీ యి.
. అపుడు దాని రంగును, కాంతిని చూడు.
షిరిడీ సాయి 09.02.93
23. జీవితములో తీర్థయాత్రలు (భగవంతుని
అన్వేషణ) చేయటము మంచిదే. అలాగ అని మొదటి ష్టేషన్
నుండే యాత్ర ప్రారంభించనవసరము లేదు. మధ్య ష్టేషన్
లో కూడా రైలు ఎక్కి యాత్రలు ప్రారంభించు.
షిరిడీ సాయి 01.02.93
24, జీవితములో గుడులు, గోపురాల చుట్టు
ప్రదక్షిణలు చేయటము వలన నీవు భగవంతుని చుట్టు ప్రకక్షిణలు చేసిన అనుభూతిని మాత్రమే
పొందగలవు. దానికంటే గొప్ప విషయము చెబుతాను
విను. భగవంతుడు నీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి
అంటే దిక్కులేనివానికి దేవుడే దిక్కు అనే మాట ప్రకా రము ఒక దిక్కులేని అనాథబాలుడిని
నీ ఒడిలో చేర్చుకో, అపుడు భగవంతుడు ఆ అనాధ బాలుని చూడటానికి నీ చుట్టూ ప్రదక్షిణలు
చేస్తాడు.
షిరిడీ
సాయి 13.02.93
25. జీవితములో నీవు ఒంటిఎద్దు బండినిలాగే
ఒంటి ఎద్దువి. బండిని లాగి లాగి అలసిపోయినావు. కొంచము విశ్రాంతి తీసుకో. తిన్న తిండి (జ్ఞాపకాలను) నెమరు వేసుకో. ఆ తర్వాత అవసరము అయితేనే తిరిగి బండిని లాగటానికి
ప్రయత్నించు.
షిరిడీ సాయి 14.02.93
26. జీవితము సినిమాను ప్రదర్శించే
యంత్రములాంటిది. నీవు ఆయంత్రమును నడిపేవాడివి. తెరమీద బొమ్మను చక్కగా చూపించినంతకాలము ప్రేక్షకులు
(భార్యాపిల్లలు) ఆ సినిమాను చూస్తూ అనందించుతూ నీ గొప్పతనాన్ని చూసి పొగడుతారు. ఒకవేళ సినిమా మధ్యలో ఫిలిం తెగిననాడు నీ చేతకానితనానికి
నిందించుతారు. మళ్ళీ ఆ ఫిలుమును అతికించి తెరమీద
"శుభం" అనే అక్షరాలు కనిపించేవరకు నీవు ఆ సినిమా యంత్రాన్ని నడుపుతూ ఉండాలి. ప్రేక్షకులను వదలి పారిపోలేవు.
షిరిడీ సాయి 02.03.93
27. జీవితము ఏడు అంతస్థుల మేడవంటిది. ;మొదటి ఆరు అంతస్థులలో నివసించకుండ ఏడవ అంతస్థులో
ఏడు ద్వారాల గదిలో నీవు నాతో కలసి నివసించుతూ భగవంతుని దగ్గరకు చేరటానికి ప్రయత్నించు.
షిరిడీ సాయి 08.02.96
28. జీవితములో మనము ఎన్నిగాలిపటాలను
పందాలలో తెగకోసినాము అనేది మంచిది కాదు. జీవితములో
ఎన్నిగాలిపటాలు చిక్కుపడకుండ ఎగరవేయగలిగాము అనేది ముఖ్యము.
షిరిడీ సాయి 27.09.95
29. జీవితములో నీవు సంపాదించిన ఆస్థి
పాస్థులను చూసి నిన్ను నీ బంధువులు గుర్తించుతారు. దొంగలు నీ ఆస్థి పాస్థులను దోచుకుంటారు. నీవు నానుండి ఆధ్యాత్మిక సంపదను సంపాదించుకో. ఎవరూ దానిని దొంగిలించలేరు. ఆ సంపాదనను పదిమందికి పంచిపెట్టి సాయి బంధువుల గుర్తింపు
పొందు.
షిరిడీ సాయి 31.10.95
30. జీవితములో పంతాలకు పోరాదు. జీవితము మన ముందుకు ఏవిథముగా వస్తే దానిని సంతోషముగా
స్వీకరించి ఒడిదుడుకులు లేకుండా జీవించాలి. శిరిడీ సాయి
14.12.95
No comments:
Post a Comment