సాయి.బా.ని.స. డైరీ -
1994 (16)
15.05.1994
నిన్న రాత్రి కలలో
శ్రీ సాయిని
నా నిజ
స్థితిని చూపించమని వేడుకొన్నాను. శ్రీ
సాయి విచిత్రమైన
సంఘటనలను చూపించినారు. వాటి వివరాలు
.
"అది ఒక వివాహ వేదిక.
మగ పెళ్ళివారు అట్టహాసముతో
ఊరేగింపుగా వివాహ బేదిక దగ్గరకు వచ్చి
తమకు యివ్వవలసిన
కట్నమును యివ్వమని ఆడ పెళ్ళివారిని కోరినారు.
ఆడపిల్ల
తండ్రి కట్నమును
దాచిన ట్రంకు
పెట్టి నాదగ్గర
భద్రపరచి యుంచినారు. ఆడపిల్ల తండ్రి
కట్నము డబ్బు
కోసము నా
దగ్గరకు వచ్చి పెట్టిలోనుండి
ధనము తీసు
యివ్వమని కోరినారు. నేను తాళము
కప్పను తాళము
చెవితో తెరచి
పెట్టె మూత
తీసినాను. పెండ్లి
కుమార్తె తండ్రికి పెండ్లి పనులలో సహాయము
చేయాలని తలంపుతో
ఆ డబ్బు
గల పెట్టెను
నా దగ్గర
ఉంచుకొన్నాను. ఆ పెట్టె మూత
తెరవగానే అందులో డబ్బు కనిపించలేదు.
వివాహ వేదిక దగ్గర ఉన్న పెళ్ళి
పెద్దలు అందరు
నన్ను దొంగగా భావించినారు. పెట్టెలోని
కట్నము ధనము
దొంగిలించబడినది అని తెలియగానే
పెండ్లి కుమార్తె తండ్రి
కిరసనాయలను తన వంటి మీద పోసుకొని
అంటించుకొని ఆత్మహత్యకు సిధ్ధపడినారు. పెండ్లి
కుమర్తె తండ్రి
ఆత్మహత్యకు నేను బాధ్యుడిని అనే ఉద్దేశముతో
నేను కూడ
ఆ మంటలోనికి
దూకినాను. యింతలో
ఆ ధనమును
దొంగిలించిన వ్యక్తి అక్కడకు వచ్చి నవ్వసాగినారు. నేను
మరియు ఆ
పెండ్లి కుమార్తె
తండ్రి అసలు
దొంగను గుర్తించి,
యిద్దరము కలసి ఆ అసలు
దొంగను కౌగలించుకొంటాము. ఆ అసలు దొంగ
కూడా మంటలలొ
చిక్కుకొన్నాడు." నేను
భయముతో నిద్రనుండి
లేచి ఈ
విధమైన కలకు
అర్థము ఏమిటి
అని ఆలోచించసాగినాను.
18.05.1994
నిన్నటిరోజున కొంతమంది స్వాములము
అని చెప్పి
శ్రీ సాయి
పేరిట డబ్బు
వసూలు చేసి
తమ పబ్బము
గడుపుకొంటున్న సంఘటనలు తెలిసినవి. రాత్రి
నిద్రకు ముందు
శ్రీ సాయికి
నమస్కరించి, "సాయినాధ నీపేరిట
డబ్బు వసూలు
చేసి స్వాహా
చేసే స్వాములవారి
సంగతి ఏమిటి? వారిపై
నీ ఉద్దేశము
ఏమిటి తెలియచేయి
తండ్రీ అని
వేడుకొన్నాను. శ్రీ
సాయి అజ్ఞాత
వ్యక్తి రూపములో
దర్శనము యిచ్చి
చెప్పిన మాటలు
"తోడబుట్టిన అక్క, చెల్లెలు
మీద ప్రేమ
కూడ లేకుండ
వాళ్ళ సొమ్మును
స్వాహా చేసే
పెద్ద మనుషులు
ఉన్న ఈ
సమాజములో నా పేరిట డబ్బు వసూలు చేసి
స్వాహా చేయడము
ఓ పెద్ద
విశేషము కాదు. నా పేరిట గారడీ
విద్యలు చేసి
చూపించి తమ
పొట్ట నింపుకొనే
స్వాములవారి దగ్గరకు వెళ్ళటము నీ తప్పు. అంతే
గాని ఆ
స్వాములవారి తప్పు మాత్రము కాదు అని
గ్రహించు.
23.05.1994
నిన్నటి రోజున కొంతమంది
సాయి భక్తులు
నా యింటికి
వచ్చినారు. వారు
శ్రీ సాయి
గురించి చాలా ప్రశ్నలు
వేసినారు. నేను
నాకు తెలిసిన
విషయాలు వారికి
చెప్పినాను రాత్రి నిద్రకు ముందు శ్రీ
సాయికి నమస్కరించి,
శ్రీ సాయి
తత్వ ప్రచారములో
నేను అనుసరించవలసిన
పధ్ధతిని తెలియచేయమని
వేడుకొన్నాను. శ్రీ
సాయి అజ్ఞాత
వ్యక్తి రూపములో
దర్శనము యిచ్చి
అంటారు. "యితరుల
జ్ఞాన నేత్రము
తెరిపించాలి అనే ప్రయత్నము మంచిదే కాని
ముందు నీవు
నీ నేత్రాలతో
మంచిని చూస్తూ
నీ జ్ఞాన
నేత్రమును తెరచిన తర్వాతనే యితరుల జ్ఞాన
నేత్రము గురించి
ఆలోచించు". శ్రీ
సాయి యింకొక
కలలో చూపిన
దృశ్యము వివరాలు. అది ఒక గ్లాసులు
తయారు చేసే
దుకాణము.
ఆ దుకాణము యజమాని
ఒక ముసల్మాన్. నేను
ఆ దుకాణములో
అల్యూమినియం రేకులతో అల్యూమినియం గ్లాసులు తయారు
చేసి వాటిలో
నీరు నింపి
దారిని పోయే
బాటసారులకు దాహము తీర్చుతున్నాను. కాని
నేను తయారు
చేసే గ్లాసులకు
రంధ్రాలు యుండటము చేత నేను పోసిన
నీరు కారిపోయి
వృధా అగుతున్నది. అపుడు
ఆ దుకాణదారుడు
(శ్రీ సాయి)
నన్ను దగ్గరకు
పిలచి "నీవు నాదగ్గర ఈ గ్లాసుల
తయారీ అనేక
జన్మలనుండి చేస్తున్నా పనితనము సరిగా నేర్చుకోలేదు.
అందుచేత ఈ
జన్మలో గ్లాసుల
తయారీ పనిని
మంచిగా నేర్చుకొని
గ్లాసులు తయారు చేసి బాటసారుల దాహము
తీర్చటానికి అందులో నీరు నింపి వారికి
ఈయి." ఈ విధమైన సూచనకు
నాకు తెలివి
వచ్చినది. ముందుగా
నేను శ్రీ
సాయి తత్వము
బాగా నేర్చుకొని
యితరులకు ఆ తర్వాతనే చెప్పాలి అని
నిశ్చయించుకొన్నాను.
26.05.1994
నిన్నటిరోజున శ్రీ సాయి
గురించి ఆలోచించుతూ
శిరిడీకి అనేక భాషల ప్రజలు వచ్చి
శ్రీ సాయి
దర్శనము చేసుకొంటున్నారు.
మరి శ్రీ సాయికి
అన్ని భాషలు
తెలుసునా అనే చిత్రమైన ప్రశ్నతో రాత్రి
నిద్రపోయినాను. కలలో
ఏవిధమైన దృశ్యము
కనిపించలేదు. కాని
ఒక శ్రావ్యమైన
కంఠముతో నాకు
వినిపించిన మాటలు "నీవు ఏ భాషలోనైనా
మాట్లాడు, నీ భావాలను నేను అర్ధము
చేసుకోగలను. వెంటనే
నేను నీ
దరికి చేరుతాను." వెంటనే
తెలివి వచ్చినది. ఎవరో
నా ప్రక్కనే
నిలబడి నాతో
మాట్లాడిన అనుభూతిని పొందినాను. ఆ అనుభూతిలో శ్రీ
సాయిని
గుర్తించగలగినాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment