Wednesday, 4 January 2012
సాయిబానిస డైరీ - 1992
సాయిబానిస డైరీ - 1992
4 వ. భాగము
10.08.1992 సోమవారము : క్యాంప్ : నంద్యాల - కర్నూల్ క్యాంప్
ఈ రోజు నా తండ్రి ఆబ్ధికము - ఉదయము నంద్యాల్ నుండి కర్నూల్ లోని సాయి గుడికి బస్సులో ప్రయాణము ప్రారంభించినాను. ఆ బస్సు నంద్యాల్ దాటిన తర్వాత చెడిపోయినది. యింకొక బస్సులో ఫుట్ బోర్డుపై నిలబడి కర్నూల్ కు బయలుదేరినాను. చేతితో శ్రీ సాయి సత్ చరిత్రను ముఖము దగ్గర పెట్టుకొని నిలబడినాను. బస్సు వేగముగా వెళుతున్నది. రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టు కొమ్మ నాముఖానికి తగిలినది. ఆ కొమ్మ నా కంటికి తగలకుండ శ్రీ సాయి సత్ చరిత్ర కాపాడినది. బుగ్గ మీద చిన్న గాటు పడినది. శ్రీ సాయి నన్ను ఈ విధముగా పెద్ద ప్రమాదమునుండి కాపాడినారు.
మధ్యాహ్న హారతి పూర్తి అగుతున్న సమయానికి కర్నులులోని శ్రీ సాయి మందిరానికి చేరుకొన్నాను. చేతిలో రెండు బియ్యము పొట్లాలు, దక్షిణ ఉంచుకొని వాటిని స్వీకరించేవారికి యివ్వటానికి గుడి ఆవరణలో కూర్చుని ఉన్నాను. ఒంటిగంట ప్రాంతములో ముసుగు (బురఖా) వేసుకొన్న ఓ ముస్లిం స్త్రీ వచ్చి భిక్ష కోరినది. నా తండ్రి పేరిట బియ్యము పొట్లము, రెండు రూపాయల దక్షిణ యిచ్చినాను. ఇంకొక వ్యక్తి కోసము ఎదురు చూస్తున్నాను. ఆ నిరీక్షణలో సాయి మందిరములో కూర్చుని నిద్ర పోసాగాను. యింతలో ఒక చిన్న కుఱ్ఱవాడు (5 సంవత్స్రములవాడు) వచ్చి నన్ను నిద్ర నుండి లేపి దక్షిణ కోరినాడు. నేను సంతోషముతో నా తండ్రి పేరిట బియ్యము పొట్లము, రెండు రూపాయల దక్షిణ యిచ్చినాను. టైము చూసుకొన్నాను. సరిగ్గా మధ్యాహ్న్నము మూడు గంటలు. శ్రీ సాయి చిన్న పిల్లవాని రూపములో వచ్చి నానుండి బియ్యము మరియు రెండు రూపాయలు దక్షిణ స్వీకరించనారు అని భావించి మందిరములో ఉన్న సాయి విగ్రహానికి నమస్కరించి కర్నూల్ బస్ స్టాండులో ఉన్న హోటల్లో భోజనము చేసినాను. నా భోజనము పూర్తి అయినపుడు సమయము మధ్యాహ్నము 3.30 నిమిషాలు. శ్రీ సాయి 07.08.92 నాడు యిచ్చిన సూచనలు, సలహాలు ప్రత్యక్షముగా జరగటము శ్రీ సాయి లీలగా భావించినాను.
11.08.1992 మంగళవారము
ఈ మధ్య ప్రయాణాల బడలికతో కొంచము అలసిపోయినాను. రాత్రి శ్రీ సాయి, నా మితృడు శ్రీ బీ.ఎన్. మూర్తి రూపములో దర్శనము ఇచ్చి "నీ అరోగ్యము జాగ్రత్త - భోజనముతో పాటు రోజు నాలుగు వెల్లుల్లిపాయలను తిను" అన్నారు. ఇదే విధముగా శ్రీ సాయి నా మితృడు శ్రీ బీ.ఎన్.మూర్తి రూపములో 18.07.92 శనివారము తెల్లవారుజాము కలలో దర్శనము ఇచ్చి "నీవు కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నావు కదూ - నీ ఆరోగ్యము జాగ్రత్త. రోజు ఉదయము ఒక చిన్న చెంచా తేనె త్రాగు. కాకరకాయ ఆరోగ్యమునకు మంచిది. కాకరకాయ విరివిగా తిను" అన్నారు. దీనిని బట్టి శ్రీ సాయి ఆనాడు తన భక్తులకు మందులు యిచ్చి మంచి హస్తవాసిగల డాక్టర్ అనే పేరు వ చ్చెను." అని శ్రీ సాయి సత్ చరిత్ర ఏడవ అధ్యాయములో వ్రాసి ఉండటము నిజము అని నమ్ముతాను.
18.08.1992 మంగళవారము
నిన్న రాత్రి శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "జీవితములో ఓటమిలో గెలుపును - గెలుపులో ఓటమిని చూడటము నేర్చుకో" అని చెప్పి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయి ప్రశాంత జీవితము గడుపుతున్న శ్రీ జీ.ఎస్.స్వెల్ల్ గార్ని, జీవితములో గెలుపు సాధించి నాను అనే ఉద్దేశముతో అహంకారముతో బ్రతికి అవసాన దశలో త్రాగటానికి మంచి నీరు ఇచ్చేవారు లేక బాధపడుతున్న నా దగ్గర బంధువును చూపించి, నా కళ్ళు తెరపించినారు. శ్రీ సాయి సత్ చరిత్ర ఐదవ అధ్యాయములో శ్రీ సాయి మొహినోద్ది న్ తంబోలాతో కుస్తీ పట్టి ఓడిపోయి - ఓటమిలో గెలుపును గుర్తించినారు అనేది నిజము అని గ్రహించినాను.
25.08.1992 మంగళవారము
ఈ రోజు చేతిలో డబ్బు లేక చాల బాధపడినాను. యింటి ప్రహరి గోడకు పునాదిలో రాళ్ళతో గట్టిపరచి సిమెంటుతో ప్లాస్టరింగ్ చేయకపోతే గోడ పడిపోతుంది. కాంట్రాక్టర్ సాయంత్రానికి డబ్బు తెమ్మనమని చెప్పినాడు. నా దగ్గర ఉన్న రూ.450/- అతనికి యిచ్చినాను. మిగిలిన సొమ్ము సాయంత్రము ఇస్తాను అని మాట యిచ్చి పని ప్రారంభించమని చెప్పినాను. మిగిలిన రూ.650/- ఎక్కడినుండి తేవాలి అనే ఆలోచనతో ఒక స్నేహితుని యింటికి వెళ్ళినాను. అతనికి నా పరిస్తితి చెప్పినాను. అతను డబ్బు ఇవ్వటానికి తటపటాయించుతున్నాడు. అతని పరిస్థితి చూస్తే డబ్బు ఉ న్నా నాకు ఇచ్చే ఉద్దేశముతో లేనివానివలె కనిపించినాడు. అతని గదిలో ఉన్న శ్రీ సాయి ఫొటో ముందు ప్రార్థించినాను. శ్రీ సాయినాధుడు నా ప్రార్థన విన్నాడు. నా స్నేహితుడు లోపలికి వెళ్ళి నేను అడిగినదానికంటే ఎక్కువ డబ్బు నాకు అప్పుగా యిచ్చినాడు. శ్రీ సాయి ఈ విధముగా నాయింటి ప్రహరి గోడ పడిపోకుండ కాపాడినారు. సాయంత్రము ఆఫీసునుండి రాగానే "సాయ్హిబాబా" ఆధ్యాత్మిక సంచిక వచ్చినది. ఆతృతగా "ద్వారకామాయి అనుభవ మంటపము" శీర్షిక చవటము ప్రా రంభించినాను. చాలా ఆశ్చర్యము ఆ పత్రికలో నాకు ఉదయము జరిగిన అనుభవమును పోలిన అనుభవము ప్రచురించబడినది. ఒక భక్తుడు శిరిడీకి వెళ్ళటానికి ధనము లేక బాధపడుతు తన చేతికి అందకుండ బ్యాంకు ఖాతాలో ఉండిపోయిన ధనము గురించి శ్రీ సాయిని ప్రా ర్థించి బ్యాంకుకు వెళ్ళి రూ.4,533/- పొందిన సంఘటన నన్ను చాలా ఆశ్చర్య పరచినది. శ్రీ సాయి తన భక్తుల కష్ఠసు ఖాలను ఎల్ల ప్పుడు గుర్తుంచుకొంటారు అనే అనుభూతిని నేను పొందినాను.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment