Friday 6 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 - 1 వ. భాగము




07.01.2012 శనివారము

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1994 ప్రారంభము 

సాయి.బా.ని.స. డైరీ - 1994 1 వ. భాగము 

03.01.1994

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో దృశ్యరూపములో యిచ్చిన సందేశము. "జీవిత ప్రయాణములో అంటరానివారు అనే భేదభావము లేకుండ సకల జనులతోను, అనాధ బాల బాలికలతోను, దైవ భక్తులతోను, కలసి భగవన్ నామస్మరణ చేస్తూ ధైర్యముగా ప్రయాణము చేయాలి." 

04.01.1994 

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో విచిత్రమైన దృశ్యాన్ని ప్రసాదించినారు. "నేను - నా స్నేహితుడు గొడవపడుతు కత్తి యుధ్ధము చేయసాగాము. నేను నా ఆత్మ రక్షణ కోసము అతనిని హత్య చేసినాను. 
సమాజము నన్ను హంతకుడిగా చిత్రించినది. పోలీసులు నా గురించి గాలించుతున్నారు. నా అంతట నేను పోలీసులకు లొంగి పోతాను. కోర్టులో భగవంతుడు న్యాయపరమైన తీర్పు యిస్తాడు అనే నమ్మకముతో కోర్టుకు హాజరు అగుతాను. నిద్రనుండి ఉలిక్కి వడిలేచినాను. శ్రీ సాయి పటము వైపు చూసినాను. శ్రీ సాయి ఈ దృశ్యము ద్వారా యిచ్చిన సందేశము .. "ఆధ్యాత్మిక శక్తి మనలో ఉన్నంతవరకు ధైర్యముగా ఎట్టి పరిస్తితినైనను ఎదుర్కొనవచ్చును" 

06.01.1994 

శ్రీ సాయి నిన్న రాత్రి కలలో చూపిన దృశ్యము శ్రీ సాయి నన్ను నా గత జీవితములోనికి తీసుకొని వెళ్ళి నాపాపాలకు పరిహారము - పరిష్కారము చూపించినారు. వాటి వివరాలు. అది 1962 - 65 మధ్య కాలము. కాకినాడలోని శ్రీ వాడ్రేవు కోదండరామయ్యగారి యింటిలో మేము అద్దెకు ఉన్న రోజులు. నేను మంచి చెడు అనే విచక్షత లేకుండ గడుపుతున్న రోజులు ఒక రోజున పెద్ద త్రాచు పాము యింటి చూరులో వ్రేలాడుతూ అతి కష్ఠము మీద తనవంటిమీద ఉన్న కుబుసాన్ని విడిచివెళ్ళిపోయినది. నేను 1965 లో ఉద్యోగము నిమిత్తము కాకినాడ వదలివెళ్ళినాను. ఈ దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సందేశము "మనిషి జీవితము నాగుపామువంటిది. అహంకారము అనే కుబుసాన్ని వదలిపెట్టి భగవంతుని మెడలో హారము కావాలి. 

09.01.1994 

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, ధన - ధారా - సంతానము పై వ్యామోహము తొలగించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాకు కనువిప్పు కలిగించినవి. ధన సంపాదన కోసము భార్య భర్తలు జీవితములో అడ్డదారులు త్రొక్కినపుడు ఆ ప్రభావము వారి పిల్లల మీద పడుతుంది. అపుడు ఆ సంసారములో నైతిక విలువలు యుండవు. అటువంటి కుటుంబమును సంఘము వెలివేస్తుంది. ఇంకొక దృశ్యములో భార్య భర్తల సంసార జీవితములో భార్య, భర్త అదుపు ఆజ్ఞలలో యుండకుండ స్వాతంత్రము ప్రకటించి ఆ సంసారము కుక్కలు చింపిన విస్తరిగా మార్చిన సంఘటన. యింకొక దృశ్యములో సంసార జీవితములో యింటి యజమాని కష్ఠపడి ధనము సంపాదించి భార్య, పిల్లలను పోషించుతాడు. పిల్లలు పెద్దవారు అగుతారు. 

 

 
ఆయజమాని ఉద్యోగమునుండి రిటైరు అగుతాడు. అపుడు ఆ యజమాని అనారోగ్యముతో బాధపడుతున్న సమయములో, భార్య పిల్లలు డబ్బు ఖర్చు అగుతుంది అనే ఆలోచనలతో ఆయింటి యజమానికి కనీసము మందు కొని యివ్వరు. ఆ యజమాని తనకు మందు కొని యివ్వకపోయిన ఫరవాలేదు కనీసము విషము కొని యివ్వమని వేడుకొన్నా విషము కూడ కొని యివ్వరు ఆ పిల్లలు. కారణము ఆ యింటి యజమాని చనిపోతే నెల నెల వచ్చే పించను రాక ఆగిపోతుంది అనే భయము. యిటువంటి దృశ్యాలు శ్రీ సాయి చూపించిన తర్వాత యింకా ధనము (డబ్బు), ధార (భార్య), సంతానము (పిల్లలు) మీద ఏమి వ్యామోహము ఉంటుంది. 

10.01.1994 

నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నాలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నాలో చాలా ఆలోచనలను రేకెత్తించినవి. వాటి వివరాలు. 1) అనాధ స్త్రీలకు, అనాధ పిల్లలకు సేవ చేస్తున్నపుడు మనసులో వికారాలకు పోకుండ బ్రహ్మచర్యము పాటించుతు, దయ, త్యాగము సానుభూతిని వారికి అందచేయాలి. 2) పసిపిల్లలలోను, అన్ని జీవులలోను భగవంతుని చూడాలి. 3) నీకు అన్యాయము చేసినవారు నీ యింటికి వచ్చినపుడు చిరునవ్వుతో మాట్లాడగలగాలి.

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment