Sunday, 8 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 మూడవ భాగము



 
09.01.2012  సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.. డైరీ -  1994 

మూడవ భాగము

నిన్నటి రాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యాలు నన్ను చాలా ఆకట్టుకొన్నాయి.  దృశ్యాలు చూసిన తర్వాత శ్రీ సాయి చెప్పిన మార్గములో నడుస్తానని మాట యిచ్చినాను.  శ్రీ సాయి నా ఆఫీసు జీవితములో నాకు యిష్ఠము లేని ఉన్నత అదికారి రూపములో దర్శనము యిచ్చి తన యింటికి రమ్మనమని ఆహ్వానించినారు. 


 అటువంటి అధికారి యింటికి వెళ్ళటానికి నాకు మనసు అంగీకరించటములేదు.  నేను ఆలోచనలో పడ్డాను.  అపుడు ఆయనకేసి చూసినాను.  ఆయనలో నా సాయినాధుడు కనిపించినాడు.  ఆయనకు నమస్కరించినాను.  ఆయన యింటికి వస్తాను అని మాట యిచ్చినాను.  ఆయన వెనకాలే నేను ఆయన యింటికి వెళ్ళి నాను.  ఆయన యిల్లు పెద్ద మామిడి తోటలో మధ్యన ఉంది.   




మామిడి చెట్లకు కాయలు చాలా ఉన్నాయి.  కాయలు నడచివెళ్ళేవారి శిరస్సుకు తగిలేలాగా యున్నాయి.   అధికారి అంటారు.  నీశిరస్సుకు మామిడికాయలు తగలకుండ నా యింటిలోనికి రావాలి.    



 
నేను తోటలో నేల మీద ప్రాకుతూ యింటి గుమ్మము దగ్గరకు వెళ్ళగలుగుతాను.  అక్కడ అధికారి అంటారు.  కోరికలు అనే   మామిడికాయలను ఆశించకుండ నా యింటి గుమ్మము వరకు రాగలిగినావు.  కాని, నీలోని ద్వేషాన్ని వదలి నా యింటిలోనికి రావాలి అంటారు.  నేను చికాకుపడినాను.  నిద్రనుండి మెలుకువ వచ్చినది.  శ్రీ సాయి నా నుండి ద్వేషాన్ని పారత్రోలమని సలహా యిచ్చినారు కదా అని తలచి ద్వేషాన్ని పారత్రోలటానికి ప్రయత్నించాలి అని నిశ్చయించుకొన్నాను. 

22.01.1994

నిన్నటిరోజున అనారోగ్యముతో బాధపడినాను.  అనారోగ్యముకు దూరంగా ఉండే మార్గము చూపమని శ్రీ సాయిని వేడుకొన్నాను.  శ్రీ సాయి దృశ్యరూపములో చూపిన విషయాల సారాంశము (1) మనిషికి అనారోగ్యము మానసిక ఆందోళనవలన కలుగుతుంది. అందుచేత మనసుకు ప్రశాతత కలిగేలాగ చూసుకోవాలి. (2) సాత్విక ఆహారము భుజించాలి.  (3) ఖరీదు అయిన పండ్లు తినటము మంచిదే కాని అప్పుడప్పుడు నేరేడు పళ్ళు కూడా భుజించాలి.  (4) ఎదుటివానికి శారీరకముగాను, మానసికముగాను హాని కలిగీంచవద్దు.  నీవు ఎదుటివానికి విధమైన బాధలు కలిగించేతే భగవంతుడు అటువంటి బాదలు నీకు కలిగించుతాడు అనేది గుర్తు ఉంచుకో.

23.01.1994

నిన్న రాత్రి శ్రీ సయికి నమస్కరించి, ఆధ్యాత్మిక శక్తి పెరగటానికి సలహాలు యివ్వమని వేడుకొన్నాను.  శ్రీ సాయి యిచ్చిన సూచనలు సలహాలు :

1) పరస్త్రీ వ్యామోహములో పడి జీవించుతున్న వ్యక్తికి యింకొక వ్యక్తి తన యింట స్త్రీలపై వ్యామోహము చూపించినపుడు కలిగే పరివర్తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.

2) కాటికి కాళ్ళు చాచుకొని యింకా స్త్రీ వ్యామోహము వదలని వ్యక్తిని చూసినపుడు నీలో కలిగే జుగుప్స ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది.

3)  నీకంటే గొప్పవాడిని చూసినపుడు అతనిపై ద్వేషము లేకుండ యుండి అతనిలోని మంచితనాన్ని గ్రహించగలిగిన రోజున నీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.

4)  తినడానికి జీవించటము లేదు అనే భావన నీలో కలిగిన రోజున నీలో ఆధ్యాతిమిక శక్తి పెరుగుగుతుంది.
 
24.01.1994

నిన్నటిరోజున శ్రీ సాయి సత్చరిత్ర (యింగ్లీషు) 51 . అధ్యాయము పారాయణ పూర్తిచేసినాను.  శ్రీ సాయి దయవలన నాకు రావలసిన నా డబ్బు రూ.3,000/- నా చేతికి అందినది.  తిరిగి శ్రీ సాయి సత్ చరిత్ర - యింగ్లీషు భాష లేదా తెలుగు భాషలో పారాయణ ప్రారంభించాలా అనే విషయము తేల్చుకోలేక రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి సలహాను ప్రసాదించమని  వేడుకొన్నాను.  శ్రీ సాయి మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డిగారి రూపంలో దర్శనము ఇచ్చి చేతిలోని తెలుగు పుస్తకము గట్టిగా చదువుతున్నారు.  నిద్రనుండి మెలుకువ వచ్చింది.  శ్రీ సాయి నన్ను తెలుగు భాషలోని శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేయమని ఆదేశించుచున్నారని  భావించినాను.  
 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment