బాబా అహంకారాన్ని తొలగించుట
సాయితో సాయి.బా.ని.స అనుభవాలు - 5
హేమాద్రిపంత్ (అన్నా సాహెబ్ ధబోల్కర్) శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి యోచించినప్పుడు, శ్రీ సాయి తన అంకితభక్తుడైన శ్యామాతో (మాధవరావ్ దేష్పాండే) “ హేమాద్రిపంత్ తన అహంకారాన్ని విడిచి నా పాదాలనుఆశ్రయింపుమని చెప్పు, నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు” అన్నారు. శ్రీ సాయి యెల్లప్పుడు తన భక్తుల మదిలోఅహంకారం కలగకుండా చూస్తూ వారు ఆధ్యా త్మికంగా యెదగడానికి సహాయం చేస్తూ ఉండేవారు. ఈ నా అనుభవాలక్రమములో అయిదవ అనుభవం లో శ్రీ సాయి నా అహంకారాన్ని తొలగించిన విధానాన్ని తెలియ చేస్తాను.
అది డిసెంబరు 1990, శీతాకాలం ఉదయపువేళ సికందరాబాదు స్టేషన్ దగ్గరున్న శ్రీ గణేష్ మందిరంలో పూజ చేయించుకుని బయటకి వచ్చాను. దక్షిణ భారత సాంప్రదాయపు దుస్తులలో ఉన్న మధ్యవయస్కుడైన ఒక , వ్యక్తిచిరునవ్వుతో నానుండి ఒక రూపాయి దక్షిణ కోరినారు. ఆ విలక్ష్ణమైన చిరునవ్వు మా యింటిలో ఉన్న శ్రీసాయిఫొటోని జ్ఞప్తికి తెచ్చింది. సహజంగా నేను సాయే వచ్చి దక్షిణ అడుగుతున్నారని భావించి. ఆయనకు ఒక రూపాయిఇచ్చినాను. ఆ పెద్దమనిషికి ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన తరువాత, దగ్గరిలో ఉన్న శ్రీ పాండురంగ విఠల్ మందిరంవైపునడవసాగాను. ఆ మార్గంలో శ్రీ గోకుల్ లాడ్గ్ దగ్గరికి వచ్చేసరికి నాలో ఒక ఆలోచన వచ్చింది. నేను గె జిటెడ్ ఆఫీసరునిశ్రీ సాయి యెప్పుడు నానుండి ఒక రూపాయి మాత్రమే దక్షిణగా యెందుకడుగుతారు. కనీసం రెండు రూపాయలు దక్షిణఇచ్చే స్థోమత నాకు ఉంది కదా, మరి బాబా ఒక రూపాయి మాత్రమే అడగడము నా తప్పిదము కాదు. ఇటువంటిఆలోచనతో నడుస్తుండగా శ్రీ గోకుల్ లాడ్గ్ మెట్ల మీద కూర్చుని ఉన్న ఒక ఫకీరు, నన్ను గట్టిగా పిలవ సాగినాడు. నేనుఅసంకల్పితంగా వారి వద్దకు వెళ్ళాను. వారు నన్ను చూసి, నీవొక పెద్ద ఆఫీసరువి నేను బీదవాడినైన సాయిబాబాను. నేను అడి గినంత ధనము నువ్వివగలవా? నువ్వు నన్ను బిచ్చగాడిననుకుంటున్నావా? నీలో అహంకారముయెక్కువయింది. ఖబడ్దార్ అని నన్ను తిడుతుంటే నేను శిలా విగ్రహంలా నిలబడి తిట్లని వినసాగాను. నేను చేసినపొరపాటును గ్రహించాను. నామనసులోని ఆలోచనలను ఈ ఫకీరు ఎలా పసిగట్టగలిగినారు. సాక్షాత్తూ సాయిబాబాయేఈ ఫకీరు రూ పంలో వచ్చి నాలోని అహంకారాన్ని తొలగించి నన్ను సక్రమ మార్గంలో పెట్టారని భావించాను. ఇకపరిసరాలను కూడా పట్టించుకోకుండా ఆ ఫకీరు పాదాలకు నమస్కరించి వారి చేతిలో రెండు రూపాయల నోటును ఉంచివారి ఆశీర్వచనాలు తీసుకుని శ్రీ పాండురంగ విఠల్ గుడికి బయలుదేరి వెళ్ళాను. పాండురంగవిఠల్ గుడికి వెడుతూవెనక్కి తిరిగి చూశాను. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ ఫకీరెక్కడా కనపడలేదు. శ్రీ సాయి తాను సర్వాంతర్యామిననిచెప్పడానికి మరి యు నాలోని అహంకారాన్ని తొలగించడానికి ఆ ఫకీరు రూపంలో దర్శనమిచ్చారని భావించాను.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment