08.01.2012 ఆదివారము
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1994
రెండవ భాగము
11.01.1994
నిన్న రాత్రి శ్రీ
సాయికి నమస్కరించి
ఆధ్యాత్మిక రంగానికి మార్గము చూపమని వేడుకొన్నాను. శ్రీ
సాయి కలలో
అజ్ఞాత వ్యక్తి
రూపములో దర్శనము
యిచ్చి అంటారు.
- "ఆధ్యాత్మిక
రంగములో పయనించటానికి
అడవిలోనికి వెళ్ళి తపస్సు చేసుకోవలసిన అవసరము
లేదు.
నీవు చక్కగా సంసార జీవితము సాగించుతు
ప్రకృతి నుండి
పాఠాలు నేర్చుకొంటు
ఆధ్యాత్మిక రంగములో ప్రయాణము చేయవచ్చును.
మతాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే
అని చాటి
చెప్పు. యితర
మతాల జోలికి
పోవద్దు. మతం మారిపిడిని ప్రోత్సహించవద్దు. పండగలన్నిటిలోను
పసిపిల్లలకు జరిపే అన్నపాశన పండగ అంటే
నాకు చాలా
యిష్ఠము.
13.01.1994
నిన్న రాత్రి శ్రీ
సాయికి నమస్కరించి
- సాయి శక్తి
గురించి చెప్పమని
వేడుకొన్నాను. శ్రీ
సాయి కలలో
అన్ఞాత వ్యక్తి
రూపములో కనిపించి
అన్నారు. 1) నీ
జీవితములో నిన్ను ఉన్నత స్థానానికి చేర్చగల
శక్తి సాయి
శక్తి.
2) పదిమందిలోను ధైర్ర్యముగా మాట్లాడగల
శక్తి సాయి
శక్తి 3) నీ యింట దారిద్ర్యాన్ని పారద్రోలే శక్తి సాయి శక్తి
4) జీవితములో క్రమ శిక్షణ యివ్వగల శక్తి
సాయి శక్తి
5) చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోయగల అమృత
శక్తి సాయిశక్తి
6) నీ జీవితము
నడకలో నిన్ను
కాపాడే శక్తి
సాయి శక్తి.
17.01.1994
నిన్న రాత్రి శ్రీ
సాయికి నమస్కరించి
నిద్రపోయినాను. కలలో
శ్రీ సాయి
చూపిన దృశ్యాలు
కనువిప్పు కలిగించినవి. నేను జీవితములో
"మంచి" "చెడు" అనే
యిద్దరు స్నేహితులతో
ప్రయాణము చేస్తున్నాను. చెడు
స్నేహితుడు చాలా బలవంతుడు. మంచి
స్నేహితుడు బలహీనుడు.
ప్రయాణము మధ్యలో
చెడు స్నేహితుడు
మంచి స్నేహితుని
బాధలు పెట్టసాగినాడు. నేను
ఈ అన్యాయాన్ని
చూడలేక మంచి
స్నేహితునికి సహాయము చేస్తాను. చెడు
స్నేహితుడు నన్ను ప్రలోభపరచి నా చేతికి
కత్తిని యిచ్చి
మంచి స్నేహితుని
చంపమంటాడు.
నేను
ప్రలోభాలకు లొంగను. అపుడు మంచి
స్నేహితుడుని రక్షించటానికి నేను ఆ కత్తితో
చెడు స్నేహితుని
పొట్టలో పొడుస్తాను. చెడు
స్నేహితుడు చనిపోవడు. మంచి స్నేహితుడు
నా దగ్గరకు
వచ్చి చెడు
స్నేహితుని గొంతులో అతని ప్రాణము
యుంది అందుచేత
గొంతులో పొడవమని
సలహా యిస్తాడు. నేను
ధైర్యముగా చెడు స్నేహితుని గొంతులో కత్తితో
పొడుస్తాను. చెడు
స్నేహితుడు చనిపోతాడు. చుట్టూ చేరిన
ప్రజలు పోలీసులను
పిలుస్తారు. నేను
పోలీసులకు లొంగిపోవాలని ఆలోచించుతూ
ఉంటాను. అపుడు
మంచి
స్నేహితుడు నా దగ్గరకు
వచ్చి పోలీసులకు
లొంగిపోతే నీవు అనవసరమైన కష్ఠాలలో యిరుక్కొని
పోతావు. అందుచేత
దూరంగా ఉన్న
పవిత్ర స్థలానికి
పారిపో అంటాడు. నేను
ఆ పవిత్ర
స్థలానికి వెళ్ళటానికి బస్సు కోసము ఎదురు
చూడసాగినాను. ఆ బస్సు స్టాప్
లో చాలామంది
ముసలి దంపతులు
ఉన్నారు. వారు
బస్సు కోసము
ఎదురు చూస్తున్నారు.
నా భార్య నాకు
తోడుగా రాలేదు. ఆ బస్సు స్టాప్
లో ఓ
అజ్ఞాత వ్యక్తి
వచ్చి నా
చేతికి నాలుగు
బ్యాటరీ లైట్లు
యిస్తాడు. నేను
సంతోషముగా స్వీకరించుతాను --- నిద్రనుండి
మెలుకువ వచ్చి
ఈ కల
గురించి ఆలోచిచినాను. ఆ మంచి, చెడు
అనే స్నేహితులు
నాలోని మంచి,
చెడు ఆలోచనలకు
ప్రతిరూపము. చెడు
స్నేహితుని చంపటము మంచి ఆలోచనలను పెంచుకోవటము
పోలీసులు అంటే సంసార బంధాలు.
ముసలి దంపతులు అందరు సాయి భక్తులు. బస్సు
ప్రయాణములో నాకు తోడుగా నా భార్య
రాదు అంటే
సంసార బంధాలు
నుండి నేను
ఒక్కడిని విడివడి ఆధ్యాత్మిక ప్రయాణము
సాగించాలి. ఆ అజ్ఞాత వ్యక్తి
శ్రీ సాయి. ఆయన యిచ్చిన బ్యాటరీ
లైటు - జీవితములో
నాలుగు వైపులనుండి
కమ్ముకొనే చీకట్లని పారత్రోలటానికి
ఉపయోగ పడే
సాధనము, ఆశీర్వచనాలు
అని భావించినాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
No comments:
Post a Comment