Wednesday, 4 January 2012

సాయిబానిస డైరీ 1993 23 వ.భాగము

05.01.2012 గురువారము
సాయిబానిస డైరీ 1993 23 వ.భాగము ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సాయి బంధువులకు బాబావారి ముక్కోటి ఏకాదశి శుభాశీస్సులు
08.12.1993 09.00 ఏ.ఎం. ఈ రోజున మెహది పట్నములోని అద్దె యిల్లు ఖాళీ చేసి తిరిగి కమలానగర్ లోని స్వంత యింటికి వెళ్ళాలని సామానులు సర్దుకొని సిధ్ధముగా ఉన్నాను. మెహదీపట్నము వదలి వెళ్ళేముందు ఒక్కసారి శ్రీ హఫీజ్ బాబాగారి దర్శనము చేసుకోవాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అనె కోరికను శ్రీ సాయికి తెలియపర్చి, హఫీజ్ బాబాగారి యింటికి వెళ్ళినాను. కాని నా దురదృష్ఠము హఫీజ్ బాబాగారు అనారోగ్యముతో నిద్రపోతున్నారు. వారిని లేపటానికి కుదరదు అని వారి కుమారుడు చెప్పినారు. బరువైన మనసుతో యింటికి వచ్చి లారీలో సామానులు సర్దుతున్నాను. ఆ సమయములో శ్రీ హఫీజ్ బాబాగారు చేత కఱ్ఱ పట్టుకొని మెల్లిగా నడచుకొంటు నాయింటికి వచ్చి ఉదయము నేను వారి యింటికి వచ్చిన సంగతి వారి కుమరుడు వారికి చెప్పినాడట. వెంటనే నన్ను చూడాలనే ఉద్దేశముతో నాయింటికి వచ్చినారు అని చెప్పినారు. నేను వారి ఆశీర్వచనాలు పొందినాను. నా మనసు సంతోషముతో పొంగినది. శ్రీ సాయికి నమస్కరించి నేను శ్రీ హఫీజ్ బాబా యింటికి వెళ్ళితే శ్రీ సాయి హఫీజ్ బాబాగార్ని నా యింటికి పంపటము శ్రీ సాయి లీలగా భావించినాను. 20.12.1993 నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి, ఆధ్యాత్మిక సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపంలో దర్శనము యిచ్చి అన్నారు. 1. రోగముతో బాధపడుతున్న రోగికి ఔషధ దానము చేయి. 2. నీవు తినటానికి తిండిలేక మొక్క జొన్న పొత్తు తింటుయున్న సమయములో పరమ పిసినిగొట్టు ఆకలితో నీదగ్గరకు వచ్చినపుడు నీవు తింటున్న మొక్కజొన్న పొత్తులో సగము అతనికి అన్నదానముగా ఈయి. 3. నీ విరోధి నీకు తారసపడినపుడు చిరునవ్వుతో అతనికి ఒక కప్పు టీ త్రగటానికి యివ్వు. 4. దానాలలో అన్నదానము - జీవితములో కన్యాదానము చేయటము చాల మంచిది. 21.12.1993 నిన్నటిరోజున నా విరోధుల గురించి ఆలోచిచుతు రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి తెల్లని గడ్డము, తలకు తెల్లని బట్ట కట్టుకొని, తెల్లని కఫనీ ధరించి, ఒక గుడిలో భోజనము చేసి బయటకు వచ్చి చేతులు కడుగుకుంటు నన్ను చూసి అన్నారు. "నీవు ఎవరిని నిందించటము నాకు యిష్ఠము లేదు. నీకు యిష్ఠము లేనివారినుండి నీవు దూరముగా ఉండు. ఎవరి ఖర్మ వారిది. ఖర్మను అనుభవించి తీరాలి. ఒకరి ఖర్మకు యింకొకరు బాధ్యులు కారు. అందుచేత ఎవరిని నిందించవద్దు. వ్యభిచారము చేయకపోయినా మానసిక వ్యభిచారము పాపము కదా. అదే విధముగా నీవు నీ విరోధినుండి దూరముగా యున్నపుడు అతని పరోక్షములో అతనిని నిందించటము కూడ పాపమే అని గుర్తుంచుకో". 27.12.1993 నిన్నటిరోజున టీ.వీ లో క్రిస్మస్ పండుగ వేడుకలు చూసినాను. శ్రీ సాయికి నమస్కరించి క్రిస్మస్ పండగ సందేశము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు. "నేను భగవంతుని కుమారుడిని - నా సేవను మీరు అంగీకరించి భగవంతుడిని చేరండి". శ్రీ సాయి క్రీస్తు రూపములో కూడ తన భక్తుల సేవ చేసుకొంటాను అని చెప్పినారు. 31.12.1993 నిన్నటిరోజున శ్రీ సాయికి నమస్కరించి నేను తెలుసుకోవలసిన మంచి విషయాలు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి దృశ్య రూపములో చెప్పిన విషయాలు. 1. విందులువినోదాలలో భోజనముమితముగ చేసి ఆరోగ్యము కాపాడుకో. 2. అడగనిదే శ్రీ సాయి తత్వముఎవరికిచెప్పవద్దు. నమ్మకమున్న వారికే సాయి తత్వము చెప్పు. 3. శ్రీ సాయి భకులలో కులమత భేదాలు యుండరాదు. 4. సాయి భక్తులు వీలు చేసుకొని శిరిడి యాత్ర చేసి తమ నమ్మకాన్ని బలపరచుకోవాలి. 5. శిరిడీలో అన్ని మతలవారినిసరిగా గౌరవించాలి. 6. గురుపూర్ణిమ రోజున శ్రీ సాయి పేరిట నూతన వస్త్రాలు దానము చేయాలి. 01.01.1994 నిన్నటిరోజున గుండెనొప్పితో చాలా బాధపడినాను. నా మానసిక బాధలే నా గుండె నొప్పికి కారణము అని గ్రహించినాను. రాత్రి శ్రీ సాయికి నమస్కరించి గుండె నొప్పి రాకుండ యుండే మార్గము చూపించమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన సలహాలు (1) యితరుల యింట అనవసరముగా భోజనము చేయవద్దు (2) యితరుల ముందు నీ పాండిత్యము ప్రదర్శించవద్దు (3) బంధువుల స్త్రీలకు, పరస్త్రీలకు దూరముగా ఉండు (4) నీ బంధువులతో గొడవలు పడటము మాని వేయి. (5) నీకు మానసిక శాంతి కావాలంటే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేవారితో స్నేహము చేయి. (యింతటితో సాయి.బా.ని.స. డరీ - 1993 సమాప్తం) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment