Saturday 14 January 2012

సాయి బా ని స డైరీ - 1994 (8)

 

 14.01.2012  శనివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు

సాయి బా ని డైరీ  -  1994 (8)

01.03.1994

నిన్నటిరోజున భార్య పిల్లల మీద విసుగు కలిగినదిరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "ఈసంసారము మధ్య ఉంటు సంసారముపై వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపు తండ్రీ" అని వేడుకొన్నానుశ్రీ సాయి కలలో చూపించిన దృశ్యము నాకు కనువిప్పు కలిగించినదివాటి వివరాలు.



"జీవితము అనే రైలు బండి స్టేషన్ లో ఆగినదినేను చికాకుతో రైలు పెట్టెనుండి దిగి ప్లాట్ ఫారం మీద తిరుగుచున్నాను.   యింతలో గార్డు పచ్చ జండా చూపించినాడు



 

రైలు కదలసాగినదివేగము పుంజుకోసాగిందినేను రైలు ఎక్కాలా వద్దా అనే ఆలోచనలతో ప్లాట్ ఫారం మీద నిలవడిపోయినానునాముందునుండి రైలు వేగముగా వెళ్ళిపోసాగినదిరైలు ఎక్కాలని మనసులో కోరిక ఎక్కువ కాసాగినది.   రైలు వెనకాల పరిగెత్తుతూ గార్డు పెట్టెలోనికి ఎక్కినాను గార్డు తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు 
 
 నన్ను చిరునవ్వుతో తన సీటు ప్రక్కన కూర్చుండపెట్టుకొన్నారుఆయన అంటారు "తోటి ప్రయాణీకులపై కోపముతో నీయిష్ఠము వచ్చిన స్టేషన్ లో దిగరాదునీ ఆఖరి స్టేషన్ వచ్చేవరకు నీవు ప్రయాణము చేయక తప్పదునీ స్టేషన్ లో నీవు దిగిన తర్వాత నలుగురు కూలీలు నీ ఋణము తీర్చుకోవటానికి, నిన్ను మోయటానికి వస్తారుకాని నీవు పరుండే శవపేటిక మూత వేయటానికి మాత్రము ఎవరూ తమ డబ్బు యిచ్చి మేకులు కొనరుఅందుచేత యిప్పుడే నీకు కావలసిన మేకులును నా దగ్గర కొని నీదగ్గర ఉంచుకోరైలుదిగిన తర్వాత అంతిమ యాత్రకు సిధ్ధపడు."  ఒక్కసారిగా మెలుగువ వచ్చినది విధమైన కలకు అర్ధము గ్రహించినాను.   శ్రీ సాయి, సంసారము మీద వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపినందులకు కృతజ్ఞతలు చెప్పినాను.     

03.03.1994

నిన్నటిరోజున గుండెనొప్పితో చాలా బాధపడినానుడాక్టర్ దగ్గరకు వెళ్ళలేదురాత్రి శ్రీ సాయికి నమస్కరించి నా ఆరోగ్యము బాగుపడటానికి సూచనలు యివ్వమని వేడుకొన్నానుశ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్నారు.  1) నీ జీవితములో నీ మనసుకు ఆందోళన కలిగించిన ముగ్గురుకు నీవు దూరంగానే యుంటున్నావుకదాయింకా ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించుతావువాళ్ళను మర్చిపోయి ప్రశాంతముగా జీవించు.  2) నీ యింటి వ్యవహారాలులో ఎక్కువగా ఆలోచించకుజరిగేది జరగక మానదు.  3)  నీ ఆరోగ్యము కోసము సాత్విక ఆహారము తిను.  4)  నీ పని డబ్బు సంపాదించి నీ కుటుంబ సభ్యులకు యివ్వటము మాత్రమేఖర్చు విషయము నీకు అనవసరము.  5)  నీ బంధువులతో గొడవలు పడటము మాని వేయి.  6) రోజు భగన్ నామస్మరణ చేస్తూ జీవించు.   

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment