శిఖరాలు - లోయలలో శ్రీ సాయి
41. జీవితములో నీవు కష్టాలు పడినపుడు ఆ కష్టాలను మర్చిపోరాదు. నీవు ఎదుటివానికి ఆ కష్త్టాలు కలిగించరాదు. అపుడు నీవు నిజమైన మానవుడివి. నీవు అనుభవించిన కష్టాలను ఎదుటివానికి కలిగించితే
నీవు దానవుడివి.
29.09.96
42. జీవితములో పొందిన కష్టాలు-సుఖాలు నుండే మనిషికి
ఆధ్యాత్మిక భావాలు వస్తాయి. ఆధ్యాత్మికము అనేది
వేరేగా ఎక్కడా వ్రాసి లేదు.
01.10.96
43. జీవితము ప్రశాంతముగా గడవాలి అంటే నీవు చేసే పనిలో
ముందు చూపు ఉండాలి. నీ ప్రవర్తనలో కరుణ ఉండాలి. అప్పుడే నీ జీవితము ఒడి దుడుకులు లేకుండ ప్రశాంతముగ
సాగిపోతుంది.
25.10.96
44. జీవితములో యవ్వన దశలోనే తీర్థయాత్రలు, బరువు బాధ్యతలు
పూర్తి చేసుకొని వృధ్ధాప్యము వచ్చేసరికి ప్రశాంత జీవితము గడుపుతూ భగవన్నామ స్మరణ చేయి. ప్రశాంత జీవితము ఆధ్యాత్మిక చింతనకు చాల అవసరము.
18.11.96
45. జీవితములో కష్టాలను మరచిపోవటానికి మత్తు పానీయాలు
త్రాగవద్దు. భగవంతుని ప్రేమ పొందాలనే తపనతో
ఉపవాసము చేయవద్దు.
18.11.96
46. జీవితములో గతించిన కాలము నిన్ను పగ పట్టిన పాములాగ
వెంటాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన గలవారిని
ఆ పాము ఏమీ చేయలేదు. నీ బరువు బాధ్యతలను నీవు
నిర్వర్తించటము ఆధ్యాత్మిక చింతనలో ఒక భాగమే!
నీ బరువు బాధ్యతలను నీవు నిర్వర్తించకపోతే నీ గత చరిత్ర అనే పాము నిన్ను కాటు
వేస్తుంది జాగ్రత్త.
19.04.96
47. జీవితములో గతించిన కాలపు వాసనలును వదిలించుకొని
ప్రశాంతముగా వర్తమానములో జీవించు. పునర్జన్మ
గురించి ఆలోచించవద్దు. నీ గురువు మీద నీకు
నమ్మకము ఉన్ననాడు ఆయన నీవర్తమానాన్ని నీ పునర్జన్మను చూసుకొంటారు.
07.11.96
48. జీవితములో నీ వారినుండి నీవు ప్రేమను పొందలేనినాడు
బాధపడటము సహజమే. ఇటువంటి బాధలలో ఇతరుల ఓదార్పును
మాత్రము కోరవద్దు. నీవు పొందలేకపోయిన ప్రేమను
ఏదో రూపములోనైన ప్రసాదించమని భగవంతుని వేడుకో.
12.12.96
49. జీవితములో విద్యాదానము, అన్నదానము చేసిన వ్యక్తి
మరణించితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కన్నిరు కార్చకపోవచ్చు - కాని, ఆ వ్యక్తినుండి
విద్యాదానము, అన్నదానము స్వీకరించినవారు తప్పక కన్నీరు కార్చుతారు.
17.12.96
50.జీవితములో
ధనము ఉన్నవారు, ధనము లేనివారు కూడా సంతోషముగా జీవించుతున్నారు. జీవించటానికి ధనము ఒక్కటే ప్రధానము కాదు. సంతోషముగా
జీవించాలి అనే పట్టుదల ముఖ్యము.
24.01.97
No comments:
Post a Comment